AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి డబ్బే డబ్బు..! గురు, రాహువుల అనుగ్రహంతో ఆకస్మిక ధన ప్రాప్తి

సాధారణంగా గురువుతో కలిసిన లేదా గురువు వీక్షణ పొందిన ఏ గ్రహమైనా చాలావరకు శుభ ఫలితాలనే ఇస్తుంది. రాహువు వంటి పాపగ్రహంతో కలిసినా, చూసినా ఆ గ్రహం సైతం శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల(అక్టోబర్) 31న సింహ రాశిలో సంచారం ప్రారంభిస్తున్న గురువు దృష్టి కుంభ రాశిలో ఉన్న రాహువు మీద పడడం వల్ల రాహువు తత్వం మారి, ఇంతవరకూ తాను పీడిస్తున్న కొన్ని రాశులకు శుభ యోగాలనివ్వడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మిథునం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఆర్థికంగా లాభాలు పెరగబోతున్నాయి. డిసెంబర్ 5 వరకు ధనపరంగా ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 31, 2026 | 1:17 PM

Share
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువును తృతీయ స్థానం నుంచి గురువు వీక్షించడం అక్టోబర్ 31 తర్వాత నుంచి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రారంభమవుతుంది. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి.

1 / 6
సింహం: ఈ రాశిలో ప్రవేశించిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాహువును వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం జరుగుతుంది. ఉద్యోగంలో అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. ఆర్థికపరంగా మనసులో ఉన్న ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన  ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

2 / 6
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న రాహువును  గురువు వీక్షించడం వల్ల విదేశీ ధనాన్ని అనుభ వించే యోగం పడుతుంది. విదేశాల్లో ఆశించిన జీతభత్యాలతో ఉద్యోగం సంపాదించడం, తల్లి తండ్రుల నుంచి ఆస్తి కలిసి రావడం, ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకోని మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం కూడా జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

3 / 6
వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాహువును గురువు దశమ స్థానం నుంచి చూడ డం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరుగు తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. అదనపు రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోవడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వృద్ధి చెందుతుంది.

4 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాహువును గురువు చూడడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆస్తి పాస్తులు బాగా పెరగడానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది.  అదనపు రాబడికి మార్గాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కా రమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

5 / 6
మీనం: ఈ రాశికి వ్యయ’ స్థానంలో ఉన్న రాహువును గురువు వీక్షించడం వల్ల రుణ భారం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ప్రభుత్వ ఉద్యో గాల్లో ఉన్నవారికి రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.

6 / 6
Follow Us