డయాబెటీస్ ఉన్న వారు పెరుగుతు తినొచ్చా.. అసలు వాస్తవమేంటి?
31 Oct 2026
Anand T
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా ఉంటుంది.
మంచి బ్యాక్టీరియా
అయితే డయాబెటీస్ ఉన్న వారు పెరుగు తినడం మంచిదేనా కాదా అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతుంది.
పెరుగుపై చర్చ
అయితే వారు పెరుగు తినడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పెరుగు మన రక్తంలో చక్కెర స్థాయిలను తక్షణమే పెంచదని తెలిపారు.
మంచిదే
పెరుగులో పంచదార లేదా ఇతర కృత్రిమ తీపి పదార్థాలు కలపకుండా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు
షుగర్ ఫ్రీ పెరుగు
మనం ఇంట్లో తయారు చేసుకునే సాధారణ పెరుగులో కార్బోహైడ్రెట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇదే పెద్ద హానికరం కాదు.
ఇంట్లో పెరుగు
అలాగే పెరుగులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కడుపును త్వరగా నింపి, ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గే వారికి ఇది మంచి ఎంపిక
పుష్కలమైన ప్రోటీన్
పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడి, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.పెరుగులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
కడుపు ఆరోగ్యం
మధుమేహ రోగులలో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా పెరుగు చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఇంట్లో తయారు చేసి తినే పెరుగు డయాబెటీస్ ఉన్న వారికి కూడా మంచిదే.