AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! మనీ మనీ మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా

మనీ సినిమా కోసం రేణుకా షహానిని ఆడిషన్ లేకుండానే ఎంపిక చేసిన వైనం, రామ గోపాల్ వర్మ ఇతర నటుల గురించి పట్టుపట్టిన సందర్భాలు, రేణుకా షహాని ఎత్తు సమస్యను పరిష్కరించిన విధానం, మరియు షూటింగ్ సమయంలో ఆమె చూపిన అంకితభావం, సహకారం గురించి దర్శకుడు శివనాగేశ్వరరావు వెల్లడించారు.

అమ్మబాబోయ్..! మనీ మనీ మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా
Money Money
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2026 | 12:37 PM

Share

దర్శకుడు శివనాగేశ్వరరావు  మనీ సినిమా గురించి, అలాగే ఆ సినిమా నిర్మాణంలో నటి రేణుకా షహాని ఎంపిక, అలాగే ఆ సినిమా సమయంలో జరిగిన సంఘటనలపై ప్రత్యేక వివరాలను వెల్లడించారు. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం రూత్‌లెస్ పీపుల్ నుంచి స్ఫూర్తి పొందిందని, అందులో డానీ డివిటో, బెట్టీ మిడ్లర్ ముఖ్య పాత్రలు పోషించారని ఆయన గుర్తు చేసుకున్నారు. బెట్టీ మిడ్లర్ పాత్ర కోసం మొదట రాధికను అనుకున్న శివనాగేశ్వరరావు, రామ గోపాల్ వర్మ కు ఆ విషయాన్ని చెప్పగా, రాము జయసుధ అయితేనే ఈ సినిమా చేస్తానని స్పష్టం చేశారని, లేదంటే మర్చిపోవాలని చెప్పారని శివనాగేశ్వరరావు వివరించారు. రాము పట్టుదలతో జయసుధను ఎంపిక చేశారు. ఈలోగా, క్షణక్షణం షూటింగ్ జరుగుతున్నప్పుడు, ప్రధాన నటుడి పాత్రకు ప్రకాష్ రాజ్ పేరును పరిశీలించి రాముకు చెప్పగా, ఆయన కూడా సమ్మతించారని, ఆ తర్వాత ప్రకాష్ రాజ్‌తో మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు.

అయితే, రేణుకా షహాని పాత్ర తెలుగు వెర్షన్‌లో కొత్తగా సృష్టించాం. ఈ పాత్ర కోసం రోజా, కిన్నెర, కస్తూరి వంటి పేర్లు చర్చకు వచ్చాయి. ఈ సమయంలోనే మనీ బైలింగ్వల్ (తెలుగు, హిందీ)గా రాత్రి సినిమాతో పాటు షూటింగ్ జరుపుకుంటోంది. వర్మ క్రియేషన్స్ భాగస్వామి బోనీ కపూర్, శివనాగేశ్వరరావుతో డీడీలో రాత్రి 7:30 గంటలకు వచ్చే సురభి కార్యక్రమాన్ని చూడమని, అందులో రేణుకా షహాని అనే అమ్మాయి నచ్చితే ఆమెను బొంబాయి నుంచి పిలిపిద్దామని సూచించారు. బోనీ కపూర్ మాట విని సురభి చూసిన శివనాగేశ్వరరావు, రేణుకా షహాని నటనకు పూర్తిగా నచ్చి, ఆమెను ఆడిషన్ లేకుండానే ఎంపిక చేయాలని రాముకు చెప్పారట..

ఇవి కూడా చదవండి

రేణుకా షహాని హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత, హీరో చిన్న ఎత్తుకు ఆమె ఎత్తు సరిపోవడం పెద్ద సవాలుగా మారిందని దర్శకుడు గుర్తు చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ తేజతో కలిసి హైట్ మేనేజ్ చేయడానికి కెమెరా కోణాలు, ప్రత్యేక ప్లాట్‌ఫామ్స్ (కూల్ డ్రింక్ ట్రేలు వంటివి) వాడారని, ఒక సీన్‌లో చిన్న వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లడానికి మూడు అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫామ్‌పై హీల్స్ వేసుకుని పరిగెత్తడం ఆమె అద్భుతమైన నైపుణ్యానికి నిదర్శనమని వివరించారు. రేణుకా షహాని అంకితభావం, ప్రొఫెషనలిజం అద్భుతమని శివనాగేశ్వరరావు కొనియాడారు. ఆమె స్క్రిప్ట్ మొత్తం ముందుగానే తీసుకుని, డైలాగులు బట్టీ పట్టి, తర్వాతి రోజు షూటింగ్ సీన్ నంబర్లు చెబితే చాలు, అవన్నీ సిద్ధం చేసుకుని వచ్చేదని చెప్పారు. ఆమె కళ్ళు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటాయని, సూక్ష్మమైన భావాలను కూడా అద్భుతంగా పలికించగలదని పేర్కొన్నారు. ఆమె సాంగ్స్ లిరిక్స్ కూడా వాక్‌మెన్‌లో విని వెంటనే పాడేసేదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మనీ మనీ మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!
మనీ మనీ మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!
ఖరీదైన హెయిర్ డైస్ వద్దు..ఇంటి చిట్కాతో ఈజీగా తెల్ల జుట్టుకు చెక్
ఖరీదైన హెయిర్ డైస్ వద్దు..ఇంటి చిట్కాతో ఈజీగా తెల్ల జుట్టుకు చెక్
దీపావళి వేళ సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన కూరగాయల ధరలు..
దీపావళి వేళ సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన కూరగాయల ధరలు..
రాప్తాడు స్కూల్‌లో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!
రాప్తాడు స్కూల్‌లో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!
భారత్‌కు మంచి పెట్టుబడి..ఆ ఆటగాడిపై శ్రీలంక దిగ్గజం ప్రశంసలు
భారత్‌కు మంచి పెట్టుబడి..ఆ ఆటగాడిపై శ్రీలంక దిగ్గజం ప్రశంసలు
అందుకే సునీత పాడిన పాటను మళ్లీ ఆ సింగర్ తో పాడించాం
అందుకే సునీత పాడిన పాటను మళ్లీ ఆ సింగర్ తో పాడించాం
శరీరాన్ని బలంగా మార్చి.. నరాల పనితీరును మెరుగుపరుస్తాయ్..
శరీరాన్ని బలంగా మార్చి.. నరాల పనితీరును మెరుగుపరుస్తాయ్..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలు, పనితీరు, రిటైర్మెంట్ ప్లానింగ్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలు, పనితీరు, రిటైర్మెంట్ ప్లానింగ్
ఎట్టకేలకు మ్యాన్ ఈటర్ కథ ముగిసింది! ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
ఎట్టకేలకు మ్యాన్ ఈటర్ కథ ముగిసింది! ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
ఈ 4 రాశుల వారికి హాస్యచతురత ఎక్కువట..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ 4 రాశుల వారికి హాస్యచతురత ఎక్కువట..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?