Anirudh- Kavya Wedding: అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి వేడుక.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, రజినీకాంత్, అజిత్.. భారీగా సెలబ్రిటీలకు ఆహ్వానం!
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన కార్యక్రమాలతో కావ్య మారన్‌కు మంచి గుర్తింపు ఉంది. మరోవైపు అనిరుధ్ తన సంగీతంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న ఈ రిసెప్షన్‌కు దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్ వంటి ప్రముఖుల పేర్లు అతిథుల లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. వీరి వివాహ వేడుకల సందర్భంగా నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ రిసెప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కావ్య మారన్ తండ్రి, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ స్వయంగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను కలిసి పెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కూడా ఆహ్వానాలు అందించారు. ఢిల్లీలో సోనియా గాంధీని కళానిధి మారన్, కావేరి మారన్ కలిసి ఆహ్వానించారు.
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అనిరుధ్‌కు రజినీకాంత్ దగ్గరి బంధువు కూడా.. రజినీకాంత్ నటించిన పలు సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, ఆయన భార్య శాలిని అజిత్ కుమార్‌లను కూడా ఈ రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నట్లు సమాచారం. లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేర్లు కూడా అతిథుల జాబితాలో వినిపిస్తున్నాయి.
వీరితో పాటు నటుడు ధనుష్, శివకార్తికేయన్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ వంటి ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి ఈ వేడుకకు ఆహ్వానించారని తెలుస్తుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్లు తెలుస్తుంది. అనిరుధ్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. అనంతరం నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే వివాహ తేదీలు, వేదిక, పూర్తి అతిథుల జాబితాపై అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
