నా బాడీ నా ఇష్టం.. మీ పని మీరు చూసుకోండి.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్

Rajitha Chanti

Pic credit - Instagram

30 October 2026

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి ఆహారపు అలవాట్లు, శరీరాకృతిపై కొందరు ఆన్‌లైన్ ట్రోలర్స్ చేసే అసభ్యకర కామెంట్స్ హద్దులు దాటుతున్నాయి.

ముఖ్యంగా సినీ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్ చేయడం, వారి ఫొటోలు , వీడియోలను తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం పరిపాటిగా మారింది. 

తాజాగా ట్రోల్స్ పై టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఆమె గట్టిగా బదులిచ్చారు.

తన శరీరంపై అలాగే తన డ్రెస్సింగ్ పై ఇష్టానుసారంగా అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, వీడియోలను షేర్ చేస్తున్న వారిపై పాయల్ రాజ్‌పుత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి తప్పుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. 

దయచేసి ఎవరి హద్దుల్లో వారు ఉండండి.. మీ పని మీరు చూసుకోండి” అంటూ ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించకుండా ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టే వారి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన పాయల్, ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల ‘మంగళవారం’ చిత్రంతో మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె, తన ఫొటోలు, అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఆన్‌లైన్ వేదికగా చేస్తున్న బాడీ షేమింగ్‌పై స్పందించింది.