Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

భద్ర సినిమా ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని సినిమా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బోయపాటి శ్రీను. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్ కూడా. ఇందులో రవితేజ, మీరా జాస్మిన్, సనోబర్ హెరేక, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయిన సనోబర్ హెరేక ఏం చేస్తుందో తెలుసా..

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..'భద్ర' మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2024 | 9:15 AM

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు మాస్ మాహారాజా రవితేజ. ఈ మాస్ హీరో కెరీయర్‏లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా భద్ర. ఇప్పటికీ ఈ సినిమాకు టీవీల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు ఈ మూవీ మ్యూజికల్ హిట్ కూడా. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. కానీమొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు బోయపాటి. ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మురళి మోహన్, సునీల్, ప్రకాష్ రాజ్, ఆర్జన్ బజ్వా, ఈశ్వరి రావు వంటి యాక్టర్స్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది సత్య. ఈ మూవీలో సునీల్ ప్రేమను ఓ ఆటాడుకున్న కథానాయికగా, రవితేజ మరదలుగా కనిపించింది సత్య. ఒక్క సినిమాతోనే ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ హీరోయిన్ గుర్తుందా..? తన పేరు సనోబర్ హెరేకర్.

భద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ మూవీలో ఆ బ్యూటీ కనిపించింది తక్కువ సమయమే అయినా..మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత సనోబర్ మరో చిత్రంలో కనిపించలేదు. సినిమా వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ మరో సినిమా చేయలేదు సనోబర్. కానీ ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఈ బ్యూటీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి : Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

హిందీలో పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తుంది సనోబర్ హెరేకర్. అజీజ్ జీ అనే ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకున్న సనోబర్ హెరేక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పిన బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది.

ఇది చదవండి : ఇది చదవండి : Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

View this post on Instagram

A post shared by Abdul Aziz Zee (@azizzee69)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.