AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పని ఒత్తిడిలో ప్రశాంతత కావాలా? గ్లామర్ క్వీన్ శిల్పా శెట్టి చెప్తున్న ‘ప్రాణాయామ’ మంత్రం

బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తన ఫిట్‌నెస్‌తో, గ్లామర్‌తో కుర్రకారును ఆశ్చర్యపరుస్తున్న నటి ఆమె. కేవలం వెండితెరపైనే కాదు, ఫిట్‌నెస్ రంగంలోనూ ఆమె ఒక ఐకాన్. వయసు పెరుగుతున్నా తరగని అందం ఆమె సొంతం. యోగా, సమతుల్యమైన ఆహారం ద్వారా తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలో అందరికీ నిరూపించిన ఆ 'బాజీగర్' భామ మరెవరో కాదు.. శిల్పా శెట్టి. తాజాగా షూటింగ్ పనుల్లో పడే ముందు తను ప్రశాంతంగా ఉండటానికి పాటించే ఒక రహస్యాన్ని ఆమె బయటపెట్టారు.

పని ఒత్తిడిలో ప్రశాంతత కావాలా? గ్లామర్ క్వీన్ శిల్పా శెట్టి చెప్తున్న ‘ప్రాణాయామ’ మంత్రం
Shilpa Shetty12
Nikhil
|

Updated on: Mar 18, 2026 | 6:00 AM

Share

బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ప్రొఫెషనల్ షూటింగ్‌లో బిజీ అవ్వడానికి ముందు తన మనసును ఎలా నియంత్రించుకుంటుందో ఆమె వివరించారు. “నా పని మొదలయ్యే ముందు, నేను ప్రశాంతంగా (కామ్) ఉండటానికి ఇదే నా రహస్యం” అంటూ #PranayamaForTheWin అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు.

ప్రాణాయామంతో ఒత్తిడికి చెక్..

శిల్పా షేర్ చేసిన వీడియోలో ఆమె మెరిసిపోయే గోల్డ్ హాల్టర్-నెక్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్నారు. బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని అత్యంత ప్రశాంతంగా ప్రాణాయామం (శ్వాస వ్యాయామం) చేస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలు నెరవేర్చే ముందు మనసును ఏకాగ్రతతో ఉంచడానికి యోగా మరియు ప్రాణాయామం ఎంతో తోడ్పడతాయని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. దశాబ్దాలుగా ఆమె యోగాను తన జీవనశైలిలో భాగంగా చేసుకున్నారు.

శిల్పా శెట్టి ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వారం మొత్తం క్రమశిక్షణతో కూడిన పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అయితే, ఆదివారం వస్తే మాత్రం ఆమె రూటే వేరు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ‘సండే బింజ్’ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ రోజు తనకు ఇష్టమైన తినుబండారాలను ఆస్వాదిస్తూ, చిట్-డేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూపిస్తుంటారు. లైఫ్ అంటే బ్యాలెన్స్ అని ఆమె మాటల్లో అర్థమవుతుంది.

సినిమా నుంచి టెలివిజన్ వరకు..

1993లో షారుఖ్ ఖాన్ సరసన ‘బాజీగర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శిల్పా, ఆ తర్వాత ‘ధడ్కన్’, ‘మై ఖిలాడీ తూ అనారి’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ బిజీగా ఉన్నారు. ‘సూపర్ డాన్సర్’, ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ వంటి రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.

వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న శిల్పాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు, కెరీర్, ఫిట్‌నెస్.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న శిల్పా శెట్టి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆమెలాగా ఫిట్‌గా ఉండాలనుకునే వారు కనీసం ప్రాణాయామంతోనైనా తమ రోజును ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు