AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని హోటళ్లకూ ప్రతీ సోమవారం సెలవు.. రాత్రి 10 వరకే అన్ని బంద్..!

హోటళ్లలో ఎమర్జెన్సీ టైమ్స్‌. దాదాపు కొవిడ్ నాటి గడ్డు పరిస్థితి. వంటగ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపట్లను వెలిగించుకోవాల్సిన అగత్యం. ముఖ్యమంత్రి గంటగంటకూ రివ్యూ చేస్తున్నా, మంత్రులతో, సివిల్ సప్లయ్స్ అధికారులతో, గ్యాస్ కంపెనీ డీలర్లతో టచ్‌లో ఉన్నా, ఏపీలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభం కొలిక్కి రాలేదు. అందుకే, ప్రభుత్వంతో ఒక ఒప్బందం చేసుకున్నాయి హోటల్ యాజమాన్యాలు. ఏమిటా డీల్...? దాంతో కన్‌జ్యూమర్లపై పడే ఎఫెక్ట్ ఏంటి?

అన్ని హోటళ్లకూ ప్రతీ సోమవారం సెలవు.. రాత్రి 10 వరకే అన్ని బంద్..!
Hotels Demands
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2026 | 7:42 AM

Share

మిడిలీస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట బెట్టేసింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత నషాళానికంటేసింది. బ్లాక్‌మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి నాలుగైదు వేలదాకా పలకడంతో రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్ అన్నీ మూతబడే ప్రమాదంలో పడ్డాయి. ఏపీలో ఐతే బచావ్ బచావ్ అంటూ గవర్నమెంట్ కాళ్ల మీద పడ్డాయి హోటల్ మేనేజ్‌మెంట్లు. ఏపీ స్టార్‌హోటల్స్, విజయవాడ హోటల్స్‌ సంఘాల జేఏసీ నాయకులు సివిల్ సప్లైస్ డైరెక్టర్ నూపుర్ అజయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. 3 కీలక పాయింట్లపై ఓ నిర్ణయానికొచ్చారు.

ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే హోటల్స్ రన్ చేయాలి.. అన్ని హోటళ్లూ సోమవారం సెలవు ప్రకటించాలి.. స్టార్ హోటల్స్‌లో ఐటమ్స్‌ 45 నుంచి 15కి తగ్గించాలి..! ఇవీ కండిషన్లు. నేడో రేపో జీవో రిలీజౌతుంది. సోమవారం సెలవు విషయంలో మాత్రం సడలింపు జరగొచ్చట. ఎందుకంటే, రాష్ట్రం మొత్తమ్మీద సోమవారం హోటళ్లు మూసేస్తే కస్టమర్లు ఇబ్బంది పడే ప్రమాదముంది. అదేవిధంగా, హోటళ్లలో ఇకపై ఫుడ్ మెనూ కూడా పూర్తిగా మారిపోతోందా?

కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్ ప్రకారం 80 శాతం డొమెస్టిక్ యూజర్స్‌కి మిగతా 20 శాతం మాత్రమే కమర్షియల్ యూజ్‌కి ఇవ్వాలి. కనీసం 50 శాతం ఎల్‌పీజీ ఐనా కేటాయించాలని వేడుకుంది హోటళ్ల జేఏసీ. కానీ, డిమాండ్‌కి తగ్గ సరఫరా లేక కొరత ఏర్పడింది గనుక.. హోటల్ యాజమాన్యాలు మంకుపట్టు పట్టడం లేదు. కాకపోతే, ఆ 20 శాతం కోటా కూడా పెద్ద హోటళ్లకే వెళుతోందన్నది చిన్న హోటళ్ల గగ్గోలు.

అటు, ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ ఔతున్నాయ్. కట్టెలపొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రికల్ స్టవ్.. కిచెన్ కాన్సెప్ట్‌లే మారిపోతున్నాయి. గ్యాస్ వినియోగం తగ్గించే తండూరీ ఐటమ్స్‌నీ, బొగ్గుల పొయ్యితో చేసే వంటల్ని ఎంకరేజ్ చేస్తోంది ప్రభుత్వం. బిరియానీ లాంటి సౌతిండియన్ ఐటమ్స్‌ని కట్టెల పొయ్యి మీదే వండుకోవాలని ఆదేశాలూ వచ్చేశాయ్. విధి లేక, స్విగ్గి జొమాటోలను కూడా కంట్రోల్ చేసి, వీలైనంతవరకు ఆర్డర్లు తగ్గించుకుంటున్నారు హోటల్ మేనేజ్‌మెంట్లు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!