AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక

హర్ముజ్‌ జలసంధిని అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందన్న ట్రంప్ ప్రకటనకు ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఫుడ్‌ ట్రక్కులో దాక్కుని దేశం విడిచి వెళ్లాల్సిన దుస్థితి మరోసారి తలెత్తకుండా ట్రంప్‌ తన సేఫ్టీ గురించి ఆలోచించాలని ఇబ్రహీం అజీజీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసారు.

మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
Trump And Azizi
Sharada V
|

Updated on: Aug 16, 2026 | 10:44 AM

Share

యుద్ధంలో ఇరాన్‌ పరాజయం పాలవుతుందని అనంతరం హర్ముజ్‌ జలసంధిని పూర్తిగా అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందని మీడియా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనకు ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఫుడ్‌ ట్రక్కులో దాక్కుని దేశం విడిచి వెళ్లాల్సిన దుస్థితి మరోసారి తలెత్తకుండా ట్రంప్‌ తన సేఫ్టీ గురించి ఆలోచించాలన ఇరాన్ జాతీయ భద్రతా కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఇబ్రహీం అజీజీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసారు. హర్ముజ్‌ను నియంత్రణలోకి తీసుకోవాలన్న అమెరికా కల కల్లగానే మిగిలిపోతుందని ట్రంప్‌ పిచ్చి కూతలు మానాలని ఇరాన్‌ సీనియర్‌ నేత హితవు పలికారు. హర్ముజ్ ఎప్పటికీ తమ నియంత్రణలో ఉంటుందని దానిని మూసి ఉంచాలా తెరవాలా అన్న నిర్థయం తమదేననీ హర్ముజ్ చుట్టూ యుద్ధనౌకలు మోహరించినంత మాత్రాన అమెరికాకు తాము బెదిరేది లేదని పేర్కొన్నారు.

ట్రంప్‌కు ఇరాన్‌ చురక

యుద్ధంలో అమెరికా చేతిలో ఇరాన్‌ పరాజయాన్ని చవి చూస్తుందని ఆ దేశం ఓడిన తర్వాత హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని శనివారం మీడియా సమావేశంలో ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే అని అందుకే దానిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో యుద్ధానికి దిగినట్లు చెప్పారు. అయితే, గతంలో లాగానే హర్ముజ్‌ జలసంధి ప్రస్తుతం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ  తెలిపారు. తమ సాయుధ దళాలైన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఆ మార్గంలో ప్రయాణం చేసే సాహసం చేయడం లేదని స్పష్టం చేశారు. నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి అంటున్న ట్రంప్‌ మాటల్లో నిజం లేదని హర్మూజ్‌ విషయంలో అమెరికా అన్నీ అసత్యాలే చెబుతోందని స్పష్టం చేసారు.

నాటో సదస్సు ఆఖరు రోజైన జులై 8న టర్కీ దేశంలో ట్రంప్ రహస్యంగా విమానం మార్చిన విషయం సంచలనంగా మారింది. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ గది వివరాలు ఇరాన్‌కు తెలిసిందనీ భుజంపై నుంచి క్షిపణి ప్రయోగంతో ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్‌ కుట్ర చేసిందన్న నిఘా సమాచారం అమెరికా భద్రతా అధికారులకు అందింది. దాంతో ట్రంప్‌ ను ఫుడ్‌ ట్రక్కులో విమానాశ్రయం వెలుపలికి తీసుకొచ్చి మరో సైనిక విమానంలో బ్రిటన్‌కు తరలించారు. అదే సమయం లో ఎయిర్‌ ఫోర్స్ వన్‌ “డికాయ్‌’ విమానం ప్రభుత్వ సిబ్బంది, జర్నలిస్టులతో అమెరికాకు బయలుదేరింది. ట్రంప్‌ విమానం మార్చారన్న కథనం ఇటీవల “ది న్యూయార్క్‌ టైమ్స్‌” లో ప్రచురితం కావడం సంచలనంగా మారింది. ఈ వార్తలకు కౌంటర్‌గా ఇరాన్‌ సీనియర్‌ నేత ఇబ్రహీం అజీజీ తాజాగా ట్రంప్‌ను ఎద్దేవా చేసారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయం క్లిక్ చేయండి

Follow Us