పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రజాదరణ పొందిన యూపీఐ ద్వారా జరిగే పెద్ద లావాదేవీలపై ఛార్జీల విధింపు వాయిదా పడింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వినియోగదారులు, వ్యాపారులపై అదనపు భారం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి వరకు అమలును పొడిగించే యోచనలో ఉంది.
డిజిటల్ చెల్లింపుల రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై ఛార్జీల విధింపు ఆలస్యం కానుంది. భారీ విలువ గల యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదించిన రుసుము అమలును కొన్ని నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.వాస్తవానికి, ₹2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4% రుసుమును అక్టోబర్ 15 నుంచి అమలులోకి తీసుకురావాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భావించింది. అయితే, త్వరలో దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు ప్రారంభం కానున్నందున, ఈ ఛార్జీల అమలును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ కొనుగోళ్ల సమయంలో వ్యాపారులు, వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
గత ఆరేళ్లకు పైగా ఎలాంటి రుసుము లేకుండా కొనసాగుతున్న యూపీఐ వ్యవస్థలో ప్రతిపాదించిన ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులకు నేరుగా వర్తించవు. ఇవి కేవలం వ్యాపారులు చెల్లించాల్సిన ఇంటర్‌చేంజ్ రుసుము మాత్రమే. ప్రస్తుతం దేశంలో 50 కోట్లకు పైగా యూపీఐ యూజర్లు ఉన్నారు. ప్రతి నెలా లక్షల కోట్ల రూపాయల విలువైన బిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత ఛార్జీలను వాయిదా వేయడం వల్ల రిటైల్ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం కలగదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం

