వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సీతాఫలం దిగుబడి గణనీయంగా పడిపోయింది. సకాలంలో వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత, పిందెలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్కు వచ్చే పండ్ల పరిమాణం తగ్గి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతులు పెట్టుబడి నష్టాలతో, వినియోగదారులు అధిక ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
సీజనల్ ఫ్రూట్స్లో సీతాఫలానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని తియ్యటి రుచి, పోషక విలువలు చాలా మందికి ఇష్టం. అయితే ఈ ఏడాది సీతాఫలం ప్రియులకు ఊహించని షాక్ ఎదురవుతోంది. సాధారణంగా అందుబాటు ధరలో లభించే ఈ పండు ఇప్పుడు కొనాలంటే జేబు భారమయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావంతో సీతాఫలం దిగుబడి భారీగా పడిపోవడమే. ఈ ఏడాది వాతావరణంలో సంభవించిన తీవ్ర మార్పులు, ముఖ్యంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు సకాలంలో పడలేదు. దాంతో పాటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. సీతాఫలం పంటకు కీలకమైన పూత, పిందె దశల్లో సరైన వర్షాలు, తగిన ఉష్ణోగ్రతలు లేకపోవడంతో చెట్లు దెబ్బతిన్నాయి. పూత రాలిపోవడం, పిందెలు సరిగా ఏర్పడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఫలితంగా, సాధారణ దిగుబడితో పోలిస్తే ఈసారి సీతాఫలాల పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!

