ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా విడుదల తేదీపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 2027 మార్చి 18న విడుదల కానుందని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజున రిలీజ్ డేట్ గ్లిమ్స్ రానుంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు షూటింగ్ పూర్తవుతుంది.
ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఫౌజీ సినిమా విడుదల ఎప్పుడనే కన్ఫ్యూజన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా నెలకొంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ 2027 మార్చి 18కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ఈ తేదీని ప్లాన్ చేశారు.ఈ విడుదల తేదీ వెనుక ఒక వ్యూహం ఉంది. మార్చి 18న సినిమా విడుదలైన తర్వాత, మార్చి 22న హోలీ పండుగ, ఆ వెంటనే గుడ్ ఫ్రైడే సెలవులు రావడంతో కలెక్షన్లకు పెద్ద బూస్ట్ లభిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రెండు భారీ యాక్షన్ సీక్వెన్సుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీటిని నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు పూర్తి చేయనున్నారు. అనంతరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి ఫౌజీని విడుదల చేయడానికి సిద్ధం చేయనున్నారు.ప్రభాస్ పుట్టినరోజున ఫౌజీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో కూడిన పవర్ ఫుల్ గ్లిమ్స్ బయటకు రాబోతోంది.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

