AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?

దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?

Samatha J
|

Updated on: Oct 12, 2026 | 12:54 PM

Share

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 7,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కొన్ని తేదీల్లో ప్రత్యేక బస్సుల ఛార్జీలు 1.5 రెట్లు పెరిగాయి. అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది. ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు బుకింగ్‌ చేసుకోవడం మంచిది.

దసరా పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతూళ్లకు సురక్షితంగా చేరుకోవడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం 7,000 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 9, 10, 16, 17 తేదీలతో పాటు పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వచ్చే వారి కోసం అక్టోబరు 25, 26 తేదీల్లో కూడా సేవలు అందిస్తాయి. కరీంనగర్‌ జోన్‌ నుంచి 3,533, హైదరాబాద్‌ జోన్‌ నుంచి 2,155, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,312 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, అక్టోబరు 9, 10, 16, 17, 25, 26 తేదీల్లో నడిచే ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు పెరిగిన ధరలు వర్తిస్తాయి. అయితే, రెగ్యులర్‌ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే ఉంటాయి. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దసరా సమయంలో కూడా కొనసాగుతుందని టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వై నాగిరెడ్డి స్పష్టం చేశారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ వంటి అర్హత కలిగిన బస్సులతో పాటు ప్రత్యేక సర్వీసుల్లోనూ ఈ సౌకర్యం వర్తిస్తుంది. ప్రయాణికులు తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Follow Us