Salman Khan: బిష్ణోయ్ వర్గం నుంచి బెదిరింపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న సల్మాన్ చెల్లెలు..

బాలీవుడ్ సల్మాన్ ఖాన్ పటిష్ట భద్రత మధ్య బిగ్ బాస్ 18 షూటింగ్ లో పాల్గొన్నాడు. దాదాపు 4000 కోట్ల ఆస్తులున్న ఈ హీరో.. ఇప్పుడు తన వ్యక్తిగత రక్షణ కోసం, కుటుంబ సభ్యుల భద్రత కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తాడు. తాజాగా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Salman Khan: బిష్ణోయ్ వర్గం నుంచి బెదిరింపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న సల్మాన్ చెల్లెలు..
Salman Khan, Arpita
Follow us

|

Updated on: Oct 19, 2024 | 9:37 PM

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు తన వ్యక్తిగత రక్షణ కోసం ఇప్పటికే లైసెన్స్ రివాల్వర్ తీసుకున్న సల్మాన్.. ఇప్పుడు రూ.2 కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కొనుగోలు చేశాడు. అలాగే సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు.. ఫోటోగ్రాఫర్స్, సెల్ఫీలు, అభిమానులు, సన్నిహితులకు అనుమతి నిరాకరించారు. సల్మాన్ సన్నిహితులు, బంధువులతోపాటు ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులకు కూడా మరింత భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బిష్ణోయ్ వర్గానికి చెందిన సభ్యులను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అర్పిత బాంద్రాలోని తన ఇంటిని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బాంద్రా నుండి వర్లీకి మారుతుందని.. అందుకే ఆమె తన ఇంటిని అమ్మేసిందని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ బాంద్రాలోని తమ విలాసవంతమైన ఇంటిని విక్రయించారు. ‘పీపింగ్‌మూన్’ నివేదిక ప్రకారం, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత బాంద్రాలో 1750 చదరపు అడుగుల ఇంటిని కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఇంటిని రూ.22 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. త్వరలోనే ఆమె వర్లీలోని తన కొంటికి మారనుంది. ఆయుష్ శర్మ, అర్పితా ఖాన్ ఇల్లు చాలా గ్రాండ్ గా ఉంటుంది. మొత్తం 1750 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇంటితో సల్మాన్ ఖాన్ కుటుంబానికి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.

అర్పితా ఖాన్ ఈ ఇంటిని 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీని ఫిబ్రవరి 4, 2022న చెల్లించారు. ఈ ఇంటిని ఆమెకు సల్మాన్ ఖాన్ బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఇంటి ఫోటోలను అర్పిత, ఆయుష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. ఓవైపు బిష్ణోయ్ వర్గం బెదిరింపులు వస్తున్న సమయంలో అత్యంత పటిష్ట భద్రత మధ్య బిగ్ బాస్ 18 షూటింగ్ లో పాల్గొన్నాడు సల్మాన్.

View this post on Instagram

A post shared by Arpita (@arpitakhansharma)

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?