- Telugu News Photo Gallery Cinema photos Interesting and unknown facts about Tollywod senior actress Nagma
Tollywood: నలుగురితో ప్రేమ వ్యవహారాలు.. కట్ చేస్తే.. 49 ఏళ్లు దాటినా సింగిల్ గానే టాలీవుడ్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ అన్నాక ప్రేమ, డేటింగ్ వ్యవహారాలు ఉండనే ఉంటాయి. స్క్రీన్ షేర్ చేసుకున్నట్లే రియల్ లైఫ్ ను పంచుకున్న హీరో, హీరోయిన్లు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అదే సమయంలో ప్రేమ విఫలమై ఇప్పటికీ సింగిల్ గానే ఉన్న హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు.
Updated on: Oct 19, 2024 | 9:45 PM

పై ఫొటోలో ముఖానికి మాస్క్ తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఆమెతో సినిమాలు తీసేందుకు పేరున్న దర్శక నిర్మాతలు సైతం క్యూలో ఉండేవారు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, సుమన తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉండేది.

సినిమాలతో పాటు ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలిచిన ఈ అందాల తార మరెవరో కాదు నగ్మా.

హీరోయిన్ గా సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నగ్మా నలుగురిని ప్రేమించిందని ప్రచారం ఉంది. శరత్ కుమార్, మనోజ్ తివారి, రవి కిషన్‌లతో పాటు టీమిండియా క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ఆమె లవ్ లో పడిందని రూమర్లు వచ్చాయి.

అయితే పెళ్లిపీటలెక్కముందే వీరితో బ్రేకప్ అయిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ 49 ఏళ్లు వచ్చినా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోందీ అందాల తార.




