- Telugu News Photo Gallery Cinema photos Yash Wife Radhika Pandit looks like a princes in her new photoshoot
Radhika Pandit: చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
కేజీఎఫ్ హీరో యష్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక పండిట్. పెళ్లికి ముందు పలు సినిమాల్లో నటించిన ఆమె వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటోంది.
Updated on: Oct 19, 2024 | 10:12 PM

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉండే సినిమా సెలబ్రిటీల్లో రాకింగ్ స్టార్ యష్ సతీమణి రాధికా పండిట్ కూడా ఒకరు. తన అందమైన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుందీ అందాల తార.

అలా తాజాగా రాధికా షేర్ చేసిన కొత్త ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో చక్కని చీర కట్టుతో ఎంతో అందంగా కనిపించిందీ ముద్దుగుమ్మ.

యష్, రాధికా పండిట్ దంపతులకు ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడీ వీరి పెంపకంలోనే బిజీగా ఉంటోంది రాధిక.

రాధిక పండిట్ 2016లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి రాధిక నటనకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు కూడా చాలా మంది ఆమె సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు.

ఇక రాధికా పండిట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలు అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అందులో పంచుకుంటుంది.




