Vettaiyan: రజనీకాంత్ వేట్టయన్‌కు వసూళ్ల వర్షం.. వారందరికీ బిర్యానీ వడ్డించిన టీమ్.. వీడియో చూడండి

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 'వేట్టయన్' చిత్రంలో ప్రధాన పాత్రలో మెరిశారు. అయితే అమితాబ్ నటించినా బాలీవుడ్ లో ఈ మూవీపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. దీంతో వేట్టయన్ కు సాధారణ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అయితే రజనీ మేనియా కారణంగా తెలుగులో మాత్రం ఈ సినిమాకు భారీగానే వసూళ్లు వచ్చాయని సమాచారం.

Vettaiyan: రజనీకాంత్ వేట్టయన్‌కు వసూళ్ల వర్షం.. వారందరికీ బిర్యానీ వడ్డించిన టీమ్.. వీడియో చూడండి
Vettaiyan Movie Team
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2024 | 9:53 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్ (ది హంటర్). తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజైంది. జై భీమ్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ టీజే జ్ఞాన్ వేల్ ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, రోహిణి, అభిరామి, దుశారా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. దసరా కానుకగా గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన వేట్టయన్ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రజనీ మేనియాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పటివరకు వేట్టయన్ సినిమాకు 129 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. ఈ నేపథ్యంలో వేట్టయన్ మూవీ యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్‌ పేరుతో చెన్నైలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరైన ప్రతి ఒక్కరికీ విందు భోజనాలు వడ్డించారు. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. అలాగే హీరోయిన్ రితికా సింగ్ కూడా అతిథులకు స్వయంగా బిర్యానీ వడ్డించింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వేట్టయన్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ఈ సక్సెస్ మీట్ కు రాలేకపోయారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వేట్టయన్ సక్సెస్ సెలబ్రేషన్స్ వీడియో..

లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. సినిమా విజయంలో అనిరుధ్ బాణీలు కూడా కీలకమయ్యాయని రివ్యూలు వచ్చాయి.

అతిథులకు బిర్యానీ వడ్డిస్తోన్న రితికా సింగ్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.