AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. ఫొటో గ్రాఫర్ల సంచలన నిర్ణయం.. ఇకపై..

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. నిత్యం బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు వై ప్లస్ భద్రత కల్పించారు. ఈ నేపథ్యంలో ఫొటో గ్రాఫర్లు కూడా అలర్ట్ అయ్యారు. కొన్ని నివేదికల ప్రకారం, వారు సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో వారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

Salman Khan: సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. ఫొటో గ్రాఫర్ల సంచలన నిర్ణయం.. ఇకపై..
Salman Khan
Basha Shek
|

Updated on: Oct 20, 2024 | 10:13 PM

Share

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ బోలెడు క్రేజ్ ఉంది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో సల్మాన్ కూడ ఒకరు. ఇక ఫొటో గ్రాఫర్లు అయితే ఈ నటుడి ఫొటోలు, వీడియోల కోసం ఎగబడుతుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా తమ కెమెరాలలో బంధిస్తుంటారు. ఇక సల్మాన్ కూడా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కూడా ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల ద్వారా తన అభిమానులకు తెలియజేస్తాడు. అయితే ఇప్పుడు సల్మాన్ భద్రత కారణంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల నుంచి అంగరక్షకుల వరకు అందరూ సల్మాన్ వెంటే ఉంటున్నారు. సల్మాన్‌కు వస్తున్న వరుస బెదిరింపుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఫొటో గ్రాఫర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితి సద్దుమణిగే వరకు లేదా సల్మాన్‌పై ఉన్న సంక్షోభం సద్దుమణిగే వరకు సల్మాన్ ఫోటోలు తీయకూడదని నిర్ణయంతీసుకున్నారు. అలాగే అతనికి సంబంధించిన ఎలాంటి విషయాలను షేర్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా సల్మాన్ గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకూడదని ఫొటో గ్రాఫర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఫొటోలు, వీడియోలకు నో..

సల్మాన్ ఇటీవల ముంబైలోని ఫిలింసిటీలో హిందీ బిగ్ బాస్ 18 షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయ్యే వరకు సెట్‌లోనికి బయట నుంచి ఎవరినీ లోపలికి రానివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులను అసలు సెట్‌లోకి రానివ్వడం లేదు. సల్మాన్ ఖాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశముంది. దీన్ని గమనించిన ఫొటో గ్రాఫర్లు,  సల్మాన్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరు సల్మాన్ ఖాన్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. స్టార్ హీరో క్షేమంగా ఉండడమే తమకు ముఖ్యమని చెబుతున్నారు. ఇందులో భాగంగానే సల్మాన్ ఫొటోలు, వీడియోలను బయటవారికి అందజేయకుండా కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్..

ఫొటో గ్రాఫర్లు ఇప్పుడు సల్మాన్ ఫోటోల కంటే అతని భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయం తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను, సల్మాన్ పట్ల గౌరవాన్ని చూపుతుందంటున్నారు నెటిజన్లు.

సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.