- Telugu News Photo Gallery Cinema photos Bollywood Hero shah rukh khan play a Don role in his daughter suhana khan movie, details here , Telugu Heroines Photos
Shah rukh khan: కూతురు కోసం మరింత రిస్క్ చేస్తున్న షారుక్ ఖాన్.!
షారుక్ ఖాన్ నెక్ట్స్ సినిమా ఏంటి..? జవాన్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత డంకీతో అనుకోని షాక్ తగిలింగ్ కింగ్ ఖాన్‌కు. దాంతో మరోసారి బ్రేక్ తప్పదంటున్నారీయన. చేసే సినిమా ఏదో కాస్త గ్యాప్ తీసుకునే చేద్దాం.. లేట్ అయిన పర్లేదు కానీ లేటెస్ట్‌గా వద్దాం అనుకుంటున్నారు. మరి బాద్షా నుంచి రాబోయే తర్వాతి సినిమా ఏంటి..? అదెలా ఉండబోతుంది.? ఐదేళ్ళ కసి అంతా గతేడాది తీర్చుకున్నారు షారుక్ ఖాన్.
Updated on: Oct 20, 2024 | 7:30 PM

షారుక్ ఖాన్ నెక్ట్స్ సినిమా ఏంటి..? జవాన్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత డంకీతో అనుకోని షాక్ తగిలింగ్ కింగ్ ఖాన్‌కు. దాంతో మరోసారి బ్రేక్ తప్పదంటున్నారీయన. చేసే సినిమా ఏదో కాస్త గ్యాప్ తీసుకునే చేద్దాం..

లేట్ అయిన పర్లేదు కానీ లేటెస్ట్‌గా వద్దాం అనుకుంటున్నారు. మరి బాద్షా నుంచి రాబోయే తర్వాతి సినిమా ఏంటి..? అదెలా ఉండబోతుంది.? ఐదేళ్ళ కసి అంతా గతేడాది తీర్చుకున్నారు షారుక్ ఖాన్.

మొదట పఠాన్.. ఆ తర్వాత జవాన్ సినిమాలతో 1000 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. ఈ రెండు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయిపోయారు బాద్షా. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ట్రై చేసినా ప్లాన్ వర్కవుట్ కాలేదు.

బడ్జెట్ పరంగా ఈ చిత్రం సేఫ్ అనిపించుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం ప్రభావం చూపించలేదు. డంకీ తర్వాత మరోసారి గ్యాప్ తీసుకున్నారు షారుక్ ఖాన్. ఈ మధ్యే తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

తన కూతురు సుహానా ఖాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న కింగ్ సినిమాలో తాను కూడా నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు కింగ్ ఖాన్. సుజాయ్ ఘోష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తున్నారు.

కూతురు కోసం కింగ్ సినిమాలో షారుక్ అతిథి పాత్ర చేస్తున్నారేమో అనుకున్నారంతా. కానీ అలాంటిదేం కాదు.. తను ఫుల్ లెంత్ పాత్రలోనే నటిస్తున్నానని చెప్పుకొచ్చారు బాద్షా.

అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో వస్తున్న కింగ్ సినిమాలో కిల్లర్‌గా నటిస్తున్నారు షారుక్ ఖాన్. కూతురు సుహానా కోసం కింగ్ సినిమా బాధ్యత తీసుకున్నారు కింగ్ ఖాన్.




