AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara : దొరికేసిందిరోయ్..! దావూది వాదీ సాంగ్‌లో అదరగొట్టిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. ఈ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవర సినిమా పై మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ

Devara : దొరికేసిందిరోయ్..! దావూది వాదీ సాంగ్‌లో అదరగొట్టిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..!
Devara
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2024 | 7:11 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దేవర థియేటర్స్‌లో కుమ్మేస్తోంది. ఎక్కడ చూసిన ఎరుపెక్కిన ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా పై మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా విడుదలైన తర్వాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బ్లాక్ బస్టర్ గా నిలిచింది దేవర సినిమా..

ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పటికే ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ సెట్ చేసింది. దేవర సినిమా ఘనవిజయం సాధించడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్‌తో సహా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను ఇలా చాలా మంది నటించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

ఇదిలా ఉంటే దేవర సినిమాలోని ‘దావూది వాదీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో ఈ సాంగ్ థియేటర్స్ లో లేదు.. ఆతర్వాత ఈ సాంగ్ ను యాడ్ చేశారు. ఇదిలా ఉంటే దావూది వాదీ సాంగ్ లో జాన్వీ డాన్స్ ఇరగదీసింది. జాన్వీతోపాటు సైడ్ డాన్సర్స్ కూడా డాన్స్ అదరగొట్టారు. వీరిలో ఓ అమ్మాయి మాత్రం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. చాలా మంది ఆమె ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె డాన్స్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. చాలా సినిమాల్లో ఆమె సైడ్ డాన్సర్ గా చేసింది. ఆమె పేరు సిమ్రన్ వెర్మ. ఈ అమ్మడి ఫోటోలు, వీడియోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

సిమ్రన్ వెర్మ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్