Allu Arjun: ఐకాన్ స్టార్ అంటే ప్రాణం.. అల్లు అర్జున్ కోసం పెద్ద సాహసమే చేసిన అభిమాని
అల్లు అర్జున్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.. తాజాగా ఓ అభిమాని అల్లు అర్జున్ కోసం పెద్ద సాహసమే చేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఉన్న విషయం తెలిసిందే.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక తమ అభిమాన హీరోలకు చూడటానికి, కలవడానికి ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు. ఎంత దూరం అయినా వస్తారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ వీరాభిమాని ఆయన కోసం ఓ సాహసం చేశాడు. ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు.. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ హైదరాబాద్‌కు వచ్చాడు. అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్.. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.