మీనాక్షి క్యూట్ అందాలు చూస్తే.. కుర్రకారు మటాష్ అంతే

19 May 2026

Pic credit - Instagram

Phani Ch

మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కిల్లింగ్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది ముద్దుగుమ్మ.

2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.

మీనాక్షి చౌదరి నటించిన సినిమాలు వరుసగా సంక్రాంతి పండగ వేళ సందడి చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.

దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో మీనాక్షికి 'సంక్రాంతి హీరోయిన్' అనే క్రేజీ ట్యాగ్ వచ్చేసింది. ఈ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నాగవంశీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో వచ్చిన మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా మెరిసింది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత 2025 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో మెయిన్ లీడ్‌గా నటించి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.

ఇక ఈ ఏడాది 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన 'అనగనగ ఒక రాజు' సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి జంటగా నటించింది.  మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది.