కోలీవుడ్‌లో జాన్వీ కపూర్ క్రేజీ ఎంట్రీ.. ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్

19 May 2026

Pic credit - Instagram

Phani Ch

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండియాపై గట్టిగా దృష్టి సారించారు.

కెరీర్ ప్రారంభంలో హిందీలో ఆశించిన విజయాలు దక్కకపోయినప్పటికీ, సౌత్ ఇండస్ట్రీ మాత్రం ఈ ముద్దుగుమ్మకు బ్రహ్మరథం పడుతోంది.

టాలీవుడ్ డెబ్యూ మూవీ 'దేవర'తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న జాన్వీ కపూర్, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

.ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది

వాస్తవానికి ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను సంప్రదించింది. అయితే కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆమె ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

రుక్మిణి వసంత్ తప్పుకోవడంతో, ప్రస్తుతం ఫుల్ డిమాండ్‌లో ఉన్న జాన్వీ కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించింది.

కథ వినగానే అందులోని తన పాత్ర ప్రాధాన్యత నచ్చి ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జాన్వీ కపూర్ తమిళ వెండితెరకు గ్రాండ్‌గా పరిచయం కాబోతోంది.