ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్స్‌తో కావ్య కళ్యాణ్‌రామ్ గ్లామర్ ట్రీట్..
Rajitha Chanti
Pic credit - Instagram
19 May 2026
మసూద', 'బలగం', 'ఉస్తాద్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకొని ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్‌రామ్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది.
సినిమాల్లో ఎక్కువగా హోమ్లీ పాత్రల్లో కనిపించే కావ్య, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది.
తాజాగా కావ్య కళ్యాణ్‌రామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని స్పెషల్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుండగా క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ ఫోటోలకు ఆమె "ఇంకా మే మంత్ లోనే ఉన్నామా" అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతున్నాయి.
కాలం ముగుస్తున్న తరుణంలో, మే నెల ఎండల కంటే కూడా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెట్టింట సెగలు రేపుతోంది ఈ బలగం పిల్ల. విభిన్న లుక్స్‌తో కట్టిపడేస్తుంది.
ఈ లేటెస్ట్ ఫోటో గ్యాలరీలో కావ్య కళ్యాణ్‌రామ్ ఒకే రకమైన శైలికి పరిమితం కాకుండా, ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్స్‌తో విభిన్నంగా కనిపించింది
ఒక ఫోటోలో పల్లెటూరి పడచులా చేతిలో చాట పట్టుకొని సాంప్రదాయబద్ధంగా కనిపించి మురిపించింది. "ట్రెడిషనల్ వేర్‌లో దేవతలా ఉన్నావు" అంటున్నారు.