AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కాల్సిందే..

Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2024 | 2:59 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కాల్సిందే.. అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఆమె.. అంతే కాదు అవకాశాలు వస్తే ఎలాంటి పాత్ర అయిన రెడీ అంటుంది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

అందం అభినయం ఉన్న భామలు ఈ మధ్యకాలంలో అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. కానీ ఈ చిన్నది మాత్రం తన అందంతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇంకా మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే ఎలాంటి పాత్రైనా సరే రెడీ అంటుంది. ఇంతకూ ఆమె ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ వదిలిన బాణం ఆరాధ్యదేవి. ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. 23 ఏళ్ల ఈ అందాల భామ ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మడిని సోషల్ మీడియాలో వెతికి మరీ పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఈ అమ్మడి అందాన్ని చూసి ఫిదా అయిన వర్మ గా పెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆమెను హీరోయిన్ గా పేటి శారీ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందాలను ఓ రేంజ్ లో చూపించనున్నాడు వర్మ.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్.. సాంగ్స్ లో ఆరాధ్య దేవి తన అందాలతో రెచ్చిపోయింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇన్ స్టాలో రీల్స్ చేసే సమయంలో చీర కట్టులో పద్దతిగా కనిపించిన ఆరాధ్య.. ఇప్పుడు ఈ రేంజ్ లో ఛేచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే నెటిజన్స్ షాక్ అవుతున్నారు. తాజాగా ఆరాధ్య మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది. గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని  తెలిపింది. గ్లామర్ అనేది చాలా పర్సనల్. నాకు, అది వృత్తిలో భాగం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే అని చెప్పుకొచ్చింది ఆరాధ్య.

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us