AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే రాజమౌళి సినిమా మొదలు పెట్టనున్నాడు మహేష్.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2024 | 3:27 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఉండనుంది. మహేష్ బాబు చివరగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే రాజమౌళి సినిమా మొదలు పెట్టనున్నాడు మహేష్. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. జనవరి నుంచి మహేష్ రాజమౌళి సినిమా మొదలవుతుందని హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ వైరల్ అయ్యింది.

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబందించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ ఆమె.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇంతకూ ఆమె ఎవరంటే అందాల భామ శ్రీ దివ్య.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

ఈ తెలుగు అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఆతర్వాత బస్ స్టాప్ సినిమాతో హీరోయిన్ గా మారింది తెలుగులో పలు సినిమాల్లో నటించిన శ్రీ దివ్య .. తమిళ్ లోనూ నటించి మెప్పించింది. తెలుగులో కేరింత సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తమిళ్ లో కార్తీ , విశాల్, శివకార్తికేయన్ లాంటి హీరోల సరసన నటించింది. ఇదిలా ఉంటే శ్రీ దివ్య సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శ్రీ దివ్య ప్రస్తుతం తమిళ్ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

View this post on Instagram

A post shared by Sri Divya (@sd_sridivya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్