Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు హీరో ఉదయ్ కిరణ్. ఆయన పేరు చెప్తే ప్రేక్షకులకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే స్టార్ గా ఎదిగారు

Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్
Uday Kiran
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2024 | 5:17 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి స్టార్స్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది విలన్స్ గా, మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కాగా ఎంతో మంది లెజెండ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు కూడా.. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతమంది కన్నుమూశారు. మరికొంతమంది అనుకోని ప్రమాదాల్లో మరణించారు. కాగా ఓ స్టార్ హీరో మృతదేహం చూసి మ్యూజిక్ డైరెక్టర్ చెలించిపోయారు. స్టార్ హీరోగా రాణించిన ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు అని ఎమోషనల్ అయ్యారు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరంటే..

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు హీరో ఉదయ్ కిరణ్. ఆయన పేరు చెప్తే ప్రేక్షకులకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే స్టార్ గా ఎదిగారు. వరుస విజయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. లవ్ స్టోరీలకు ఉదయ్ పెట్టింది పేరు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్.. వరుసగా నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. దాంతో ఉదయ్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోయింది.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

అయితే ఆ తర్వాత ఉదయ్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం.. అలాగే ఆయనకు అవకాశాలు తగ్గడంతో మనస్థాపానికి గురయ్యారు ఉదయ్. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. కాగా ఉదయ్ కిరణ్ గురించి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన వార్త తెలియగానే హాస్పటల్ కు వెళ్ళాను ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు. అక్కడ ఎవ్వరూ లేరు.ఎంత పెద్ద హీరో.. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అలా మూలన పడున్నాడే అని భాద పడ్డాను అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఇక ప్రేక్షకులు ఉదయ్ కిరణ్ ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆయన సినిమా పాటలు వస్తే ఆయన లేరు అన్న భాద కలుగుతుంది.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే