- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty Upcoming Movies Update on October 2024, Details here, Telugu Actress Photos
Anushka Shetty: మళ్లీ అభిమానుల ముందుకు అనుష్క.! ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ స్వీటీ బ్యాక్..
చాలా కాలం తరువాత ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. బాహుబలి తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డ ఈ బ్యూటీ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ షూటింగ్స్ కూడా పూర్తి చేసిన ఈ బ్యూటీ, త్వరలో ప్రమోషన్స్‌లో అభిమానులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత నార్మల్ లుక్‌లోకి రావటంలో ఇబ్బంది పడ్డారు.
Updated on: Oct 23, 2024 | 4:54 PM

అయితేనేం.. రీసెంట్‌గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో లక్కీ లేడీ అనిపించుకున్నారు స్వీటీ. ఈ ఏడాది ఆమె పుట్టినరోజుకు ఘాటీ నుంచి మాంచి గిఫ్ట్ రెడీ అవుతోంది.

బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా రేంజ్‌లో అనుష్క రూలింగ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం ఇంకోలా.

దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఒకటి రెండు సినిమాలు చేసిన ఆ మూవీస్‌లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి. ఆ తరువాత కూడా భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాలు చేసినా.. స్వీటీ రేంజ్‌కు తగ్గ హిట్ మాత్రం పడలేదు.

దీంతో సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్కకు అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే దక్కలేదు.

ప్రజెంట్ మలయాళంలో కథనార్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ ఘాటీలో వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి. దీంతో ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు స్వీటీ.

అనుష్క మళ్లీ అభిమానుల ముందుకు వస్తుండటంతో ఆమె లుక్స్ విషయంలో చర్చ మొదలైంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టైమ్‌కే పర్ఫెక్ట్ ఫిజిక్‌తో కనిపించారు స్వీటీ.. ఇప్పుడు రాబోయే సినిమాల్లో మరింత ఫిట్‌గా కనిపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అందుకే ఆ సినిమాల ప్రమోషన్స్ మీద కూడా ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అనుష్కతో పాటు శ్రద్ధా కపూర్ పేరు కూడా గట్టిగా ట్రెండ్ అవుతోంది.




