- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Fame Bhanu Shree Visits Kedarnath And Badrinath Temples, Shares Photos
Tollywood: కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకున్న బిగ్ బాస్ తెలుగు బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఖాళీ సమయం దొరికితే హాలిడే ట్రిప్పులకు వెళ్లిపోతారు. అందమైన పర్యాటక ప్రదేశాలు, ప్రాంతాలు వీక్షించడానికి వెళతారు. కానీ ఈ టాలీవుడ్ ప్రముఖ నటి మాత్రం ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టింది. కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది.
Updated on: Oct 24, 2024 | 10:41 PM

ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టిన ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? కొన్ని తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటోంది.

బాహుబలి, కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడు చేపల కథ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో సీజన్ 2 ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ఈ అందాల తార మరెవరో కాదు భానుశ్రీ. టీవీషోస్ తో బిజీ బిజీగా ఉంటే ఈ బుల్లితెర బ్యూటీ తాజాగా ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టింది. కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది.

తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది భాను శ్రీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా గతంలో కొన్ని టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించిందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ భాను శ్రీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.




