- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty can't touch Commercial in Her Upcoming Movies, Details Here, Telugu Heroines Photos
Anushka Shetty: కమర్షియల్ జోలికి వెళ్లని అనుష్క.. ఎందుకు.? దేవసేన ప్లానే వేరు..
అనుష్క కావాలనే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్నారా..? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్సయ్యారా..? అందుకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్‌గా ఎందుకున్నారు..? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అసలు సమస్య ఎక్కడుంది..? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి.
Updated on: Oct 24, 2024 | 9:44 PM

ఇంతకీ అనుష్క ఈ బర్త్ డేకి ఏం ప్లాన్ చేశారు? ఎలాంటి గిఫ్టులు రెడీ చేస్తున్నారు.

తెలుగు స్క్రీన్ మీద ఏ హీరోయిన్‌ని మీరు ఎక్కువగా మిస్ అవుతున్నారు అని నెటిజన్లను అడిగితే యునానిమస్‌గా వినిపించే పేరు అనుష్క.

అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. మూడు నాలుగేళ్లకో సినిమా చేస్తున్నా కూడా స్వీటీ క్రేజ్ అలాగే ఉండటానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్నా.. అనుష్క శెట్టి మాత్రం మునపట్లా హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు.

అనుష్క ఓకే అనాలే గానీ.. ఇప్పటికీ కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ క్యూ కడుతుంటాయి. కానీ జేజమ్మ ఆప్షన్ మరోలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ హీరోయిన్ కారెక్టర్స్ వైపు అనుష్క చూడట్లేదు.

ఎప్పట్లాగే లేడీ ఓరియెంటెడ్ కథల వైపు ఆసక్తిగా ఉన్నారు అనుష్క. ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా.. వాటిపై కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు జేజమ్మ. అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు.. అదే ఘాతీ.

అది కూడా ఓటిటి సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. ఇక మలయాళంలో కథనార్ సినిమా చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తుంది. పీరియడ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు.

మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఐదేళ్ళ తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క. ఆ మధ్య భాగమతి 2పై ప్రచారం జరిగింది కానీ దానిపై క్లారిటీ అయితే రాలేదు. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై విజయం సాధించింది.

దానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనేది మేకర్స్ ఆలోచన. కానీ అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయిప్పుడు.




