CID 2: బుల్లితెర ఆడియెన్స్‌కు గుడ్‌ న్యూస్.. సీఐడీ 2 వచ్చేస్తోంది.. ఎప్పటినుంచంటే?

బుల్లితెర ఆడియెన్స్ కు గుడ్ న్యూస్. ఎంతో మంది ఫేవరెట్ టీవీ షో అయిన సీఐడీకి త్వరలోనే సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో సీఐడీ టీవీ సిరీస్ అభిమానులు, నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.

CID 2: బుల్లితెర ఆడియెన్స్‌కు గుడ్‌ న్యూస్.. సీఐడీ 2 వచ్చేస్తోంది.. ఎప్పటినుంచంటే?
CID 2
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2024 | 9:30 PM

ఒళ్లు గగుర్పొడిచే నేరాలు, ఘోరాలు.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేసే సాహసాలతో ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది సీఐడీ. హిందీ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన షో ఇది. అందుకే తెలుగుతో పాటు దేశంలో అన్ని భాషల్లోనూ సీఐడీ ఎపిసోడ్స్ ను డబ్ చేసి రిలీజ్ చేశారు. వీటికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది. నేటికీ ఈ టీవీషోను ఆసక్తికరంగా చూసే ఆడియెన్స్ ఉన్నారంటే అతి శయోక్తి కాదు.ఇక ఇందులోని పాత్రలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఏసీపీ ప్రద్యుమన్ నుంచి దయా వరకు నటీనటులంతా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. సీఐడీ టీవీ సిరీస్ లో శివాజీ సతం, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్‌ శెట్టి, నరేంద్ర గుప్త, అన్ష సాయేద్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పాపులర్ టీవీ షో 21 జనవరి 1998న ప్రారంభమై.. 27 అక్టోబర్ 2018 వరకు కొనసాగింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ టీవీ సీరిస్ కు సీక్వెల్ కూడా వస్తోంది. సుమారు ఆరేళ్ల తర్వాత సీఐడీ2 తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది టీమ్. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత మరోసారి అలరించేందుకు రెడీ అయ్యామని వెల్లడించింది. అక్టోబర్‌ 26న ప్రోమో రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం సీఐడీ 2 సీక్వెల్ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. బుల్లితెర ప్రేక్షకులు, అభిమానులు, నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. సీఐడీ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. కాగా సీఐడీ టీవీ సిరీస్ లో ఫ్రెడరిక్స్ పాత్రలో అదరగొట్టారు నటుడు దినేష్ ఫడ్నిస్. సీరియస్ గా సాగే ఈ టీవీషోలో తనదైన హాస్యంతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే దినేష్ ఫడ్నవిస్ 2023లో మరణించారు. ఈ నేపథ్యంలో దినేశ్‌ ఫడ్నీస్‌ లేకుండా సీక్వెల్‌ చూడాల్సి వస్తుండటం బాధాకరమని నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 26న ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!