AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో ప్రేరణ టాప్.. డేంజర్‌జోన్‌లో ఊహించని కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎనిమిదో వారం ఎండింగ్ కు వచ్చేసింది. ఈ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో నిలిచారు. బిగ్ బాస్ ఓటింగ్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో ప్రేరణ టాప్.. డేంజర్‌జోన్‌లో ఊహించని కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?
Bigg Boss 8 Telugu
Basha Shek
|

Updated on: Oct 24, 2024 | 8:05 PM

Share

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన కొత్త సీజన్ ఇప్పుడు ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. అలాగే ఏడు వారాల్లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనిక, సీత, మణికంఠ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఉన్నారు. అలా ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది ఆసక్తికరంగా మారిది. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్వీ, నయని ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ లో ప్రేరణ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆమెకు ఏకంగా 28శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఇక సెకండ్ ప్లేస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ నిఖిల్ ఉన్నాడు. అతనికి ఇప్పటివరకు 25 శాతం ఓట్లు పడ్డాయి. ఇక మూడో ప్లేస్ లో విష్ణుప్రియ కొనసాగుతోంది. ఆమెకు 14 శాతం ఓట్లు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పృథ్వీరాజ్, నయని పావని, మెహబూబ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇందులో పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ కు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు. దీనికి తోడు విష్ణు ప్రియతో ప్రేమాయణం ప్రచారం కూడా అతనికి బాగా కలిసొస్తోంది. ఇక నయని పావని కూడా బాగానే ఆడుతోంది. టాస్కులు, గేమ్స్ లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తోంది. ఇప్పుడు ఎటొచ్చి బిగ్ బాస్ ఎలిమినేషన్ కత్తి మెహబూబ్ మెడపైనే ఉంది. అతనికి ఇప్పటివరకు 10 శాతం ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నది కూడా మెహ బూబ్ నే. అయితే శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆన్ లైన్ ఓటింగ్ కు సమయం ఉంది కాబట్టి. ఇందులో ఏమైనా మార్పులు వచ్చి మెహ బూబ్ తన ఓటింగ్ ను మెరుగు పర్చుకోవచ్చు. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం మెహ బూబ్ పెట్టే సర్దుకోవాల్సిందే.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..