Brahmamudi, October 24th Episode: కవికి ఘోరం అవమానం.. రాజ్‌ని ఆడేసుకుంటున్న అపర్ణ, బామ్మ..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కంపెనీకి ద్రోహం చేసిన ఉద్యోగిని సెక్యూరిటీగా చేయమని చెబుతుంది కావ్య. ఇకపై ఎవరైనా ఈ కంపెనీలో ఇలాంటి పనులు చేస్తే రిజల్ట్ ఘోరంగా ఉంటుందని అందరికీ వార్నింగ్ ఇస్తుంది. కావ్యని అలానే చూస్తూ ఉండిపోతుంది శ్రుతి. మేడమ్ మీకు పెళ్లి అయి ఆరు నెలలు అవుతుందా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్? అని కావ్య అడిగితే.. అంటే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అంటారు కదా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కంపెనీకి ద్రోహం చేసిన ఉద్యోగిని సెక్యూరిటీగా చేయమని చెబుతుంది కావ్య. ఇకపై ఎవరైనా ఈ కంపెనీలో ఇలాంటి పనులు చేస్తే రిజల్ట్ ఘోరంగా ఉంటుందని అందరికీ వార్నింగ్ ఇస్తుంది. కావ్యని అలానే చూస్తూ ఉండిపోతుంది శ్రుతి. మేడమ్ మీకు పెళ్లి అయి ఆరు నెలలు అవుతుందా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్? అని కావ్య అడిగితే.. అంటే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అంటారు కదా.. మీరు ఇచ్చిన పనిష్మెంట్ చూస్తుంటే రాజ్ సార్ గుర్తొచ్చారని అంటుంది శ్రుతి. ఏ నీకు కూడా యూనిఫామ్ కావాలా.. సెక్యూరిటీ అని పిలుస్తుంది కావ్య. మీకో దండం మేడమ్.. నా పని నేను చూసుకుంటాను. ఇంకెప్పుడూ ఓవరాక్షన్ చేయనని శ్రుతి అని వెళ్తుంది. మరోవైపు ఇంట్లో అపర్ణ, ఇందిరా దేవిలు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ ఇక ఆఫీస్‌కి వెళ్లరంటనా అని ఇందిరా దేవి అడిగితే.. ఏమో అత్తయ్యా అని అపర్ణ అంటుంది. అంటే సీరియస్‌గా అన్నాడా అని పెద్దావిడ అంటుంది.
మీ ఆయన దగ్గరకు పంపిద్దామని..
అప్పుడే రుద్రాణి.. ఏంటి అత్తాకోడళ్లు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? అని అడుగుతుంది. చెప్పనా అత్తయ్యా.. ఏమీ లేదు మీ ఆయన్ని వెతకడానికి సెర్చింగ్ టీమ్ బయలు దేరింది. ఎక్కడున్నా వెతికి పట్టుకుని నిన్ను మీ ఆయనకు అప్పగిస్తామని అపర్ణ అంటే.. ఈ ఇంటికి పట్టుకున్న దరిద్రం వదిలిపోతుందని మా నమ్మకం అని ఇందిరా దేవి కూడా అంటుంది. నేను చచ్చినా వెళ్లనని రుద్రాణి కోపంగా అంటుంది. అప్పుడే రాజ్ లుంగీ కట్టి.. కిందకు దిగుతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. రేయ్ రాజ్ ఏంట్రా ఈ వేషం అని రుద్రాణి అడిగితే.. ఇది నా ఫ్రీడమ్‌కి గుర్తు అత్తా.. ఈ రోజు నుంచి నాకు ఆఫీస్ లేదు.. నాపైన ఆ కళావతి మేడమ్ కూడా లేదు. శాంతా కమ్ అని పిలుస్తాడు రాజ్.. ఆ బాబుగారూ అని వస్తుంది శాంతా.. ఇదిగో మార్నింగ్ టిఫిన్.. లంచ్.. డిన్నర్‌కి అన్నీ రాసాను వండు.. తినిపెడతాను వెళ్లి కాఫీ పట్టుకు రమ్మని చెప్తాడు రాజ్.
లుంగీలో రాజ్.. ఝలక్ ఇచ్చిన కావ్య..
అప్పుడే రాజ్‌కి కావ్య ఫోన్ చేస్తుంది. చూడండి మీరు అపాయిట్మెంట్ చేసిన అప్పలమ్మ ఫోన్ చేస్తుంది. నేను లేకపోవడంతో ఆఫీస్ అంతా అల్లకల్లోలం అయిపోయి ఉంటుంది. ఆఫీస్‌కి రమ్మని నన్ను బతిమలాడటానికి ఫోన్ చేస్తుంది. ఉండండి స్పీకర్ ఆన్ చేస్తాను. హలో ఎవరు అని అడుగుతాడు రాజ్.. కావ్య సిఈవో ఆఫ్ స్వరాజ్ కంపెనీ అని చెబుతుంది. దీంతో రాజ్‌కి ఒళ్లు మండుతుంది. మీరు ఇంట్లో ఎలాంటి పని లేదని లుంగీ కట్టుకుని ఉన్నారా అని కావ్య అంటే.. నేను లేకపోవడం వల్ల అంతా గందర గోళంగా ఉందా అని రాజ్ అంటే.. అలాంటిది ఏమీ లేదు.. పనులు ఇంకా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ముందు సిస్టమ్ పాస్ వర్డ్ చెప్పమని కావ్య అడిగితే.. నేను చెప్పను కనుక్కోమని చెప్పి సవాల్ విసిరి ఫోన్ కట్ చేస్తాడు రాజ్. దీంతో సిస్టమ్ పాస్ వర్డ్ ఎలా అయినా కనిపెడుతుంది. ఆ తర్వాత పాస్ వర్డ్ కూడా మార్చేస్తుంది కావ్య.
కవిని అవమానించిన లిరిక్ రైటర్..
ఆ తర్వాత కళ్యాణ్.. లిరిక్ రైటర్ లక్ష్మీ కాంత్ ఇంటికి వస్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ అతన్ని ఆపేస్తాడు. ఆయన నాకు బాగా తెలుసు లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా.. సెక్యూరిటీ అస్సలు పంపించడు. నేను కూడా ఒక లిరిక్ రైటర్ పాటలు రాస్తానని కళ్యాణ్ అంటే.. సెక్యూరిటీ నవ్వుతాడు. అప్పుడే ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే సర్ అని పిలుస్తాడు కళ్యాణ్. రైటర్ పట్టించుకోకపోతే.. సర్ మీరు నా ఆటో ఎక్కారు.. పాట రాసి మీకు ఇచ్చానని అంటే.. వెంటనే అతన్ని పంపించమని అంటాడు. ఏంటి నీ పద్దతి అస్సలు బాలేదు. నువ్వు లిరిక్స్ రాసి నాకు ఇచ్చావా.. అందరికీ ఇలానే చెప్పుకుని తిరుగుతున్నావా? రేపు నన్ను తొక్కేసి వాడేసుకుంటున్నావ్ అని కూడా చెబుతావ్. అందుకే మీ లాంటి వాళ్లను ఎంకరేజ్ చేయకూడదని లక్ష్మీ కాంత్ అంటాడు. సారీ సర్ నేను ఇప్పటి వరకూ ఈ విషయం చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. నా లాంటి వాడిలో పడితేనే పదాలు కూడా పాటల్లా మారుతాయి. అప్పుడే ఒక అతను వచ్చి ఎవరని అడిగితే.. ఆటో డ్రైవర్ అని చెప్తాడు. అర్థమైందా నీ రేంజ్ ఏంటో అని అవమానిస్తాడు లిరిక్ రైటర్. దీంతో బాధగా అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్లిపోతాడు.
వంటింట్లో రాజ్.. వాతలు పెడతానన్న అపర్ణ..
ఆ తర్వాత అపర్ణ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏంటి వంటలు చేస్తున్నారా అని అడుగుతాడు.. లేదు పంటలు పండిస్తున్నా.. అయితే కోతలు కోయని రాజ్ అంటే.. కోతలు కాదు కానీ.. వాతలు పెడతానని అపర్ణ అంటే.. పని మనిషి శాంత నవ్వుతుంది. నువ్వు నవ్వకు అని రాజ్ అంటాడు. నీ పెళ్లాం భోజనం చేసి పెడితే చక్కగా తినేదాన్ని.. కానీ ఇప్పుడు వంట చేయాల్సి వస్తుందని అపర్ణ అంటే.. అదేంటి మమ్మీ వంట కోసం మంటను భరించలేం కదా.. ఇవేం కూరలు అంటూ వంకలు పెడతాడు రాజ్. ఆ తర్వాత అపర్ణ సెటైర్లు వేస్తుంది. దీంతో పని మనిషి నవ్వుతుంది. ఆ తర్వాత పెద్దావిడ దగ్గరకు వచ్చి మమ్మీ సెటైర్లు వేస్తుందని చెబుతాడు. అప్పుడే ఇందిరా దేవి ఖడ్గ తిక్కన్న కథ చెప్పి.. నీతి ఏంటో అర్థమైందా అని అడుగుతుంది. పౌరుషానికి పోతే.. వీర మరణం పొందుతాడని అని చెప్తాడు రాజ్. ఛీ వెధవ ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదురా అని ఇందిరా దేవి అంటే.. పని మనిషి నవ్వుతుంది. దీంతో ఏయ్ ఇటురా.. వెళ్లి ఆవాలు తీసుకురమ్మని రాజ్ అంటాడు. పని మనిషి తీసుకొచ్చాక అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమని చెప్తాడు రాజ్. నీకు ఇంత ఉక్రోశం ఏంటిరా.. అని ఇందిరా దేవి అంటుంది.
పాపం రాజ్.. ఆడుసుకుంటున్న అపర్ణ, పెద్దావిడలు..
చూడండి అమ్మ గారు.. బాబు గారు ఆఫీస్‌కి వెళ్లేంత వరకు నేను పనికి రానమ్మ గారు అని శాంతా అంటే.. ఏ అపర్ణ అడుగుతుంది. చూడండి ఇప్పుడు ఆవాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమన్నారు.. ఆ తర్వాత చుక్కలు లెక్కపెట్టమంటారు.. అని అంటుంది. ఆఫీస్‌కి వెళ్లమని బ్రతిమలాడుకుంటామని వాడి ప్లాన్. సరే నేను చెప్పినట్టు చేయి అని అపర్ణ సలహా ఇస్తుంది. అప్పుడే శాంతా వచ్చి బాబూ.. అన్నీ లెక్కపెట్టేశాను. మొత్తం 5,45,321 అని చెబుతుంది. అబ్బా చా నోటికి ఏది వస్తే అది చెబితే నమ్మేస్తానా అని రాజ్ అంటే.. సరే మీరే లెక్కపెట్టుకోండి చూద్దామని శాంత వెళ్తుంది. దీంతో ఇందిరా దేవి నవ్వుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..