Bigg Boss 8 Telugu: గంగవ్య దెబ్బకు అల్లాడిపోయిన హౌస్మేట్స్.. ఆ ఇద్దరి పని అవుట్.. కంటెండర్ రేసు నుంచి యష్మీ ఔట్..
గంగవ్య నటనతో అల్లాడిపోయారు హౌస్మేట్స్. టేస్టీ తేజ, అవినాష్ ప్లాన్ చేసినట్లుగానే గంగవ్వ జుట్టు వదిలేసుకోని యాక్టివిటీ ఏరియాలో కూర్చుని కేకలు వేస్తూ అందిరిని హడలగొట్టింది. దీంతో అందరూ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ, అవినాష్ ఇద్దరూ నామినేషన్స్ పక్కా అంటూ భయపడిపోయారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాకా హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది. రోహిణి, టేస్టీ తేజ, అవినాష్, గంగవ్వ తమ కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తున్నారు. ఇక నిన్న ఇంటి సభ్యులను అల్లాడించేసింది గంగవ్య. ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని.. తన ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ హర్ట్ అయ్యాడు బిగ్ బాస్. దీంతో ఈ వారం సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కట్ చేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్ నిఖిల్ ను మార్కెట్ కు పంపించాడు. ఇక అవినాష్, టేస్టీ తేజ చెప్పడంతో దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించి అందరిని హడలగొట్టింది గంగవ్య. అర్దరాత్రి యాక్టివిటి ఏరియాలో జుట్టు విరబూసుకుని కూర్చొని అరుస్తూ దెయ్యం పట్టినట్లు ప్రవర్తించింది. దీంతో అందరూ ఏమైందంటూ నిద్ర లేచారు. అవ్వా ఏమైందంటూ దగ్గరికి వెళ్లి హగ్గు ఇవ్వబోయింది రోహిణి. దీంతో ఒకసారి చేయి జాడించింది గంగవ్య. దీంతో రోహిణి దెబ్బకు మళ్లీ దగ్గరకు రాలేదు. అలాగే కొద్దిసేపు అరుపలు కంటిన్యూ చేసింది. ఇక ఆ తర్వాత తేజ, అవినాష్ ఇద్దరూ గంగవ్వను బెడ్ మీదకు తీసుకెళ్లి పడుకోబెట్టేశారు. ఆమె సైకలాజికల్ గా ఏదో డిస్ట్రబ్ అయ్యిందని.. కళ్లల్లో కనిపిస్తుందని గౌతమ్ అన్నాడు.
కాళ్లు చేతులు వణుకుతున్నాయంటూ అందరూ మీటింగ్స్ పెట్టారు. ఇది సీక్రెట్ టాస్క్ అని హరితేజ అంటే.. లేదు తెలియకుండానే చేసిందని రోహిణి చెప్పింది. ఇక అందరూ భయపడిన విధానం చూసి అవినాష్, తేజకు వణుకుపుట్టింది. ఇది ఫ్రాంక్ అని తెలిసి తర్వాత ఇద్దరికీ నామినేషన్స్ ఫిక్స్ అని అనుకున్నాడు తేజ. అయితే ఇదంతా స్టోరీ నడుస్తున్నా.. నిఖిల్, నబీల్, పృథ్వీ మాత్రం పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కూడా గంగవ్వ గురించే మాట్లాడుకున్నారు. రోజూ మైక్ తీసి పడుకునే గంగవ్య.. రాత్రి మైక్ వేసుకుని పడుకుంది.. పక్కా అది ప్రాంక్ అని అనుమానించాడు పృథ్వీ. ఇక ఆ తర్వాత బీబీ రాజ్యం అనే టాస్క్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఒక రాజ్యాన్ని నిర్మించడం కోసం వనరులను, సంస్తలను సమకూర్చుకోవాలని.. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల తర్వాత బీబీ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పోటీ పడతారని.. ఎవరైతే రాజ్యాన్ని ముందుగా నిర్మిస్తారో వాళ్లకు ప్రయోజం ఉంటుందని అన్నాడు బిగ్ బాస్.
ఈ ముందుగా బీబీ రాజ్యం టాస్కులో రాయల్ క్లాన్ గెలిచింది. దీంతో ఈ క్లాన్ నుంచి ఒకరు నేరుగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అన్నాడు బిగ్ బాస్. దీంతో అందరూ కలిసి రోహిణిని చీఫ్ కంటెండర్ గా ఎంపిక చేశారు. అలాగే ఓడిపోయిన ఓజీ క్లాన్ నుంచి ఒకరిని తప్పించాలని చెప్పగా.. తానే తప్పుకుంటానని చెప్పింది యష్మీ.
ఇది చదవండి : Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..
Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..
Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.