Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Manikanta: భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంఠ

బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు నాగ మణికంఠ. హౌస్ లో చిటికీ మాటికీ కన్నీళ్లు పెట్టుకుంటూ సింపతీ స్టార్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ భారీ గానే ఓట్లు సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఏడో వారంలోనే సెల్ఫ్ ఎలిమినేషన్ తో బయటకు వచ్చేశాడు.

Naga Manikanta: భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంఠ
Naga Manikanta
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2024 | 10:07 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి అనూహ్యంగా బయటకు వచ్చాడు నాగమణికంఠ. ఓటింగ్ లోనూ టాప్ లో ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు మణికంఠ. ఈ సందర్భంగా తనకు ఓట్లు వేసి మద్దతు తెలిపిన వారందరికీ క్షమాపణలు కూడా చెప్పారు. త్వరలోనే తన ఫ్యాన్స్ ను అలరించేందుకు మరో కొత్త ప్రోగ్రామ్ తో వస్తానని మాటిచ్చాడు. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభంలో తన భార్య, బిడ్డల కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ, వారి కోసమైనా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానన్నాడు మణికంఠ. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అతనిపై ఎమోషనల్ స్టార్, సింపతీ స్టార్ గా ముద్ర పడిపోయింది. అయితే ఏమైందో ఏమో గత వారంలో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనన్నాడు మణికంఠ. ఇంటికి వెళ్లిపోతానంటూ బోరున ఏడ్చేశాడు. ‘ఆరోగ్యం బాగోలేదు.. బాడీ సహకరించట్లేదు.. బయటకు పంపించండి మహా ప్రభో’ అని వేడుకోవడంతో నాగార్జున మణికంఠను బయటకు పంపించేశాడు. మణికంఠ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అతని భార్య ప్రియపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ నడుస్తోంది. కొందరు నెటిజన్లు ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నారు. వెకిలీ కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మట్లాడుతున్నారు. తాజాగా దీనిపై మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు మణికంఠ.

ఇవి కూడా చదవండి

తన సతీమణి ప్రియపై వస్తోన్న వెకిలీ కామెంట్స్ పై స్పందించిన మణికంఠ.. ‘బిగ్‌బాస్‌కు ముందు ప్రతి చిన్నదాన్ని పట్టించుకునేవాడిని, బాధపడేవాడిని. కానీ ఇప్పుడు ఇలాంటి నెగెటివ్‌ కామెంట్లను అస్సలు లెక్క చేయడం లేదు. నా పెళ్లి వీడియో వైరలయినప్పుడు కూడా నా భార్య ప్రియపై అసభ్యకర కామెంట్లు చేశారు . వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా.. ఇలాంటి కామెంట్స్ చేసే వారికి కాస్తయినా జ్ఞానం ఉండాలి. తెలివితక్కువవాళ్లు ఇలాంటి పనికిమాలిన పనే చేస్తూ ఉంటారు. నా భార్య నాకు అందగత్తె. తన మనసు ఎంతో అందమైనది. నన్ను బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లే భరించలేకపోయారు. కానీ తను జీవితాంతం నన్ను భరిస్తోంది. తను చాలా గొప్పది. దయచేసి ఆమెపై వెకిలి కామెంట్స్ చేయవద్దు’ అని అభ్యర్థించాడు మణికంఠ.

ఆరోగ్యం బాగోలేదంటూ సెల్ఫ్ ఎలిమినేషన్..

బిగ్ బాస్ బజ్ లో నాగ మణికంఠ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.