Gangavva: చిక్కుల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ.. పోలీస్ కేసు నమోదు.. హౌస్ నుంచి బయటకు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గంగవ్వ వివాదంలో ఇరుక్కున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె నిర్వహించిన ఓ యూట్యూబ్ వీడియో కు సంబంధించి గంగవ్వపై పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం.
ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. ఆమెతో పాటు యూట్యూబర్ రాజు పై పోలీస్ కేసు నమోదైంది. దీంతో గంగవ్వ బిగ్ బాస్ ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. గంగవ్వపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేవరకు ఆగుతారా లేదా హౌజ్‌కి నోటిసులు పంపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం పేరుతో ఒక వీడియో చేశారు. అందులో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటించారు. అలాగే ఈ వీడియో కోసం ఒక చిలుకను కూడా ఉపయోగించారు. ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద నేరమని స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ అనే వ్యక్తి జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన అటవీశాఖ పోలీసులు గంగవ్వతో పాటు యూట్యూబ్ రాజులపై కేసు నమోదు చేశారు. కాగా ఈ వీడియో కోసం ఈ చిలుకను కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ జ్యోతిష్యుడు దగ్గర నుంచి తెచ్చినట్టు తెలుస్తోంది.
కాగా గంగవ్వ ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. అంతకు ముందు బిగ్‌బాస్ సీజన్ 4లో గంగవ్వ తొలిసారి కంటెస్టెంట్‌గా హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే అప్పట్లో కొత్త వాతావరణం సరి పడక తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో షో మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. ఇప్పుడు మళ్లీ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వయసు సంబంధిత సమస్యల కారణంగా టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయానా తన దైన ఆట తీరుతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు గంగవ్వ. ఇది ఓటింగ్ లోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన గంగవ్వ ఇప్పుడు అనూహ్యంగా ఒక కేసులో చిక్కుకోవడం ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.