AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Divya: ‘బస్ స్టాప్’ హీరోయిన్ గుర్తుందా? ఆమె అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. నంది అవార్డు కూడా..

తన అందం, అభినయంతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీ దివ్య. బస్ స్టాప్ లాంటి బోల్డ్ మూవీలో నటించినా ఆమె ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక తమిళ్ లో కార్తీ, శివ కార్తీకేయన్, విశాల్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది.

Sri Divya: 'బస్ స్టాప్' హీరోయిన్ గుర్తుందా? ఆమె అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. నంది అవార్డు కూడా..
Sri Divya
Basha Shek
|

Updated on: Oct 21, 2024 | 4:26 PM

Share

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కూడా హిట్ కావడంతో శ్రీ దివ్యకు అవకాశాలు బాగా వచ్చాయి. అలాగే రవి బాబు దర్శకత్వంలో ఆమె నటించిన మనసారా సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అంతకు ముందు హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది శ్రీ దివ్య. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు, కేరింత, తదితర సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కంటే తమిళంలోనే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సినిమాలు చేసింది. కార్తీతో కాష్మోరా, విశాల్ తో రాయుడు , శివకార్తికేయన్ తో రెమో తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇటీవల రిలీజైన సూపర్ హిట్ సినిమా సత్యం సుందరం లోనూ ఒక కీలక పాత్రలో మెరిసింది.

ఇక ఇదిలా ఉంటే శ్రీ దివ్య వాళ్ల అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. ఆమె పేరు శ్రీ రమ్య. 2008లో వచ్చిన 1940లో ఒక గ్రామం అనే సినిమాలో కథానాయికగా నటించింది శ్రీ రమ్యనే. ఈ సినిమాకు ఏకంగా నంది అవార్డు సైతం రావడం విశేషం. బాలాదిత్య హీరోగా నటించిన ఈ సినిమాలో సుశీల అనే అమాయక అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది శ్రీ రమ్య. ఆ తర్వాత శ్రీకాంత్‌తో విరోధి, అలియాస్ జానకి వంటి సినిమాలు చేసింది. అయితే అవి పెద్దగా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. 2013లో తమిళంలో యమున అనే సినిమాలో చివరిసారిగా శ్రీ రమ్య కనిపించింది.

ఇవి కూడా చదవండి

ట్రెడిషినల్ డ్రెస్ లో శ్రీ రమ్య..

శ్రీ దివ్య, శ్రీ రమ్యల త్రో బ్యాక్ ఫొటో..

అక్క శ్రీ రమ్యతో శ్రీ దివ్య..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి