Sobhita Dhulipala: పెళ్లి పనులు షురూ.. గోధుమ రాయి, పసుపు దంచడం.. ఫొటోలు వైరల్..
టాలీవుడ్ హీరో నాగచైతన్య , నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఆగస్టు 8న జరిగింది. తాజాగా పెళ్లి పనులు కూడా మొదలయిపోయాయి. శోభిత పలు ఫొటోలు పోస్ట్ చేసి పెళ్లి పనులు మొదలు పెట్టమని తెలిపింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ పెళ్లి పనులు మొదలుపెట్టారు. తాజాగా శోభిత పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం ఫంక్షన్ వైజాగ్‌లోని తన ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. పసుపు కొట్టే కార్యక్రమంలో ట్రెడీషనల్ లుక్‌తో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ.. శోభితా కనిపించింది. ఈ ఫోటోల్లో అందంగా నవ్వేస్తూ.. సంతోషంగా కనిపించింది హీరోయిన్. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శోభిత ఈ ఫోటోలను షేర్ చేసి.. గోధుమ రాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
View this post on Instagram
పసుపు కొట్టారు అంటే పెళ్లి పనులు మొదలయినట్టే దీంతో త్వరలోనే శోభిత – నాగచైతన్య పెళ్లి ఉండబోతుంది అని తెలుస్తుంది. ఆగస్టు 8న అక్కినేని నాగచైతన్యతో ఆమె నిశ్చితార్థం జరిగింది. అయితే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విజేతగా నిలిచారు. 2016లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుసగా చాన్సులు అందుకుంటున్నారు. నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి డైరెక్షన్‌లో ఇది తెరకెక్కుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.