- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya and Sobhita Dhulipala Pre Wedding Works Started, Photos Here
Naga Chaitanya-Sobhita: పెళ్లి సందడి మొదలైంది.. అట్టహాసంగా నాగ చైతన్య- శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోస్
అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లనున్న శోభితా ధూళిపాళ్ల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తాజాగా పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం వంటి సంప్రదాయ కార్య క్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Updated on: Oct 21, 2024 | 8:00 PM

అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలుపెట్టారు. తాజాగా పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం ఫంక్షన్ వైజాగ్‌లోని శోభిత ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది.

పసుపు కొట్టే కార్యక్రమంలో ట్రెడీషనల్ లుక్‌తో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ కనిపించింది శోభితా. ఈ ఫోటోల్లో అందంగా నవ్వేస్తూ.. సంతోషంగా కనిపించింది. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శోభిత ఈ ఫోటోలను షేర్ చేసి.. గోధుమ రాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

పసుపు కొట్టారు అంటే పెళ్లి పనులు మొదలయినట్టే దీంతో త్వరలోనే శోభిత – నాగచైతన్య పెళ్లి ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఆగస్టు 8న అక్కినేని నాగచైతన్యతో ఆమె నిశ్చితార్థం జరిగింది. అయితే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ వేడుకలో శోభిత ధూళిపాళ్ల కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.





























