Vettaiyan OTT: అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జైలర్, లాల్ సలాం సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. జై భీమ్ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రజనీతో పాటు పలువురు స్టార్ యాక్టర్లు ఇందులో నటించడం విశేషం.

Vettaiyan OTT: అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vettaiyan Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2024 | 3:57 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. జై భీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. దసరా కానుకగా ఈనెల 10న విడుదలైన వేట్టయన్ సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు దక్కించుకుంది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల కలెక్షన్లు రాబట్టింని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంచనాలకు మించి భారీ వసూళ్లు రావడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా గట్టిగా నిర్వహించింది వేట్టయన్ బృందం. అందరికీ బిర్యానీలు వడ్డించారు. ఇదిలా ఉంటే వేట్టయన్ మూవీ ఓటీటీ విడుదలపై సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అతి త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వేట్టయన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందుకోసం వేట్టయన్ మేకర్స్ కూ భారీగానే ముట్టజెప్పినట్లు టాక్. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల కు సినిమా ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన నవంబర్ 7 న లేదా 9న వేట్టయన్ ఓటీటీలోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన వేట్టయన్ సినిమాలో రజనీతో పాటు మంజు వారియర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

కాగా తాజాగా వేట్టయన్ మూవీ యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్‌ పేరుతో చెన్నైలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరైన ప్రతి ఒక్కరికీ బిర్యానీతో సహా విందు భోజనాలు వడ్డించారు.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..