Unstoppable with NBK: మీరు సినిమాల్లో.. నేను రాజకీయాల్లో అన్ స్టాపబుల్ : చంద్రబాబు

తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మన్నలను పొందిన ఆహా. అన్ స్టాపబుల్  అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. బాలయ్య షోతో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనమెంట్ ఇస్తుంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు సీజన్ 4తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Unstoppable with NBK: మీరు సినిమాల్లో.. నేను రాజకీయాల్లో అన్ స్టాపబుల్ : చంద్రబాబు
తొలి ఎపిసోడ్‌లోనే కొత్త సీజన్‌ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. బాలయ్య మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఆడియన్స్‌ చేత కంటతడి పెట్టించే ఎమోషనల్ ఇన్సిడెంట్స్‌కు సంబంధించిన విషయాల గురించి కూడా చర్చించారు.
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 21, 2024 | 7:05 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు టాక్ షోతో ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల మన్నలను పొందిన ఆహా. అన్ స్టాపబుల్  అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. బాలయ్య షోతో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనమెంట్ ఇస్తుంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు సీజన్ 4తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ షోకు చాలా మంది ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు హాజరయ్యి సందడి చేశారు. బాలయ్య తనదైన స్టైల్ లో చిలిపి ప్రశ్నలు వేసి గెస్ట్ గా వచ్చిన వారిని తికమక పెట్టారు.

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా హాజరయ్యి అలరించారు. అలాగే రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ షోలో సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 4లోనూ చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇప్పుడు సీజన్ 4లో మరోసారి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరయిన చంద్రబాబు. ఇప్పుడు ముఖ్యమంత్రి గా హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

తాజాగా అన్ స్టాపబుల్ చంద్రబాబు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక నుంచి జరిగే బాలయ్య పండగ అన్ స్టాపబుల్ అని బాలయ్య కొట్టిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే చంద్రబాబు మీరు ఎలాగైతే అన్ స్టాపబుల్ గా ఉన్నారో.. నేను రాజకీయాల్లో అలా అన్ స్టాపబుల్ గా ఉంటా.. అని చంద్రబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి