- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna unstoppable With NBK season 4 Promo Responds and NBK109, BB4 movie updates, Telugu Heroes Photos
Balakrishna: బాబుతో బాలయ్య.. థింకింగ్ మారి తీరాల్సిందే.! మరోవైపు NBK109, BB4
దెబ్బకు థింకింగ్ మారాల.. కాదు కాదు.. మారి తీరాల.! ఇప్పుడు ఇదీ ట్రెండింగ్ లైన్. జస్ట్ ఇప్పుడు మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటుందనుకునేరు. ఇంకొన్నాళ్ల పాటు ఇదొక్కటే ట్రెండింగ్‌లో ఉంటుంది. అదీ అన్ స్టాపబుల్‌గా అని చెప్పకనే చెప్పేస్తున్నారు నందమూరి అభిమానులు.. ఇంతకీ థింకింగ్ మారేలా.. మారి తీరేలా.. బాలయ్య ఏమేం చేయబోతున్నారో తెలుసా.! అన్‌స్టాపబుల్ సీజన్4 ప్రోమో చూశారు కదా..
Updated on: Oct 21, 2024 | 12:02 PM

దెబ్బకు థింకింగ్ మారాల.. కాదు కాదు.. మారి తీరాల.! ఇప్పుడు ఇదీ ట్రెండింగ్ లైన్. జస్ట్ ఇప్పుడు మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటుందనుకునేరు. ఇంకొన్నాళ్ల పాటు ఇదొక్కటే ట్రెండింగ్‌లో ఉంటుంది.

అదీ అన్ స్టాపబుల్‌గా అని చెప్పకనే చెప్పేస్తున్నారు నందమూరి అభిమానులు... ఇంతకీ థింకింగ్ మారేలా.. మారి తీరేలా.. బాలయ్య ఏమేం చేయబోతున్నారో తెలుసా.!

అన్‌స్టాపబుల్ సీజన్4 ప్రోమో చూశారు కదా.. ఇంతకన్నా స్పెషల్‌గా చేయడానికి ఏముంటుంది? అని అనుకున్న ప్రతిసారీ, సరికొత్తగా ఏదో చేసి టాస్క్ బార్‌ని ఇంకాస్త హైలో పెట్టేసి , దాన్ని రీచ్ అయి మెప్పిస్తున్నారు బాలయ్య.

అలా రీసెంట్‌గా ఆయన అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో దూసుకుపోతోంది.. ఖుషీ అయిన ఆహా టీమ్, ఇప్పుడు ప్రోమో మేకింగ్‌తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేసింది. చూశారుగా అన్‌స్టాపబుల్ ప్రోమో మేకింగ్ వెనుక ఉన్న ప్లానింగ్‌ని.

మరి బాలయ్య చేస్తున్న షో అంటే మామూలుగా ఉంటుందా? ఆల్రెడీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 25 నుంచి ప్రేక్షకుల థింకింగ్ మార్చేలా రక రకాల ఎగ్జయిట్‌మెంట్ ఎలిమెంట్స్ తో సిద్ధమవుతోంది.

ఓ వైపు అన్‌స్టాపబుల్ ఎపిసోడ్స్ షూటింగ్, ఇంకో వైపు ఎన్బీకే 109 షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ దీపావళి పండుగ కోసం ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నా. సంక్రాంతికి ఎన్బీకే 109తో థియేటర్లలో కలుసుకుందాం అనే హింట్స్ ఇస్తున్నారు.

ఎన్ని పనులున్నా అఖండ తాండవం గురించి కూడా బాగానే కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు నందమూరి అందగాడు. బీబీ4గా ముందు నుంచీ ట్రెండ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ మొదలుపెట్టేసింది. సో... 2025లో బాలయ్య ప్యాన్ ఇండియా ఎంట్రీ ఖరారేనన్నమాట.




