Virat Kohli: న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఓడిపోగానే కింగ్ కోహ్లీ భార్యతో కలిసి ఎక్కడకు వెళ్లాడో తెలుసా? వీడియో వైరల్

విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఈ సంవత్సరం జనవరిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి లండన్ లోనే ఉంటోంది కోహ్లీ ఫ్యామిలీ. ఇక అనుష్క నటించిన చక్దా ఎక్స్‌ప్రెస్ షూటింగ్ కూడా అంతకంతకూ ఆలస్యమవుతోంది.

Virat Kohli: న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఓడిపోగానే కింగ్ కోహ్లీ భార్యతో కలిసి ఎక్కడకు వెళ్లాడో తెలుసా? వీడియో వైరల్
Virat Kohli, Anushka Sharma
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2024 | 3:03 PM

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ ముంబైకి వెళ్లిపోయాడు. అక్కడ తన భార్య అనుష్క శర్మతో కలిసి కృష్ణ దాస్ కీర్తనలో కూడా పాల్గొన్నాడు. కర్వా చౌత్ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కృష్ణ దాస్ భక్తి ప్రధాన కీర్తనల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు పాల్గొన్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. విరుష్క జోడీ కృష్ణ దాస్ కీర్తనలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం జూలైలో, ఈ జంట లండన్‌లో కృష్ణ దాస్ కీర్తనల్లో కనిపించారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న విరాట్ కోహ్లీ అక్టోబర్ 24లోపు పుణె చేరుకోనున్నాడు. అక్టోబరు 24 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా, పుణెలోని ఎంసీఏ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం. ఎందుకంటే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత జట్టు సిరీస్‌ను సమం చేసేందుకు రెండో మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంది.

ఒక వేళ పుణే మ్యాచ్ లో నూ ఓడిపోతే సిరీస్‌ న్యూజిలాండ్‌కు దక్కుతుంది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. . ఇక బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు. అయితేరెండో ఇన్నింగ్స్ లో 70 పరుగుల విలువైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇక బెంగళూరులో మ్యాచ్ ముగిసిన వెంటనే ముంబైలోని తన ఇంటికి ఆయన వెళ్లియాడు కోహ్లీ. దీనికి ముందు కొంతకాలంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం అతను లండన్ నుండి ఇక్కడకు కూడా చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కృష్ణ దాస్ కీర్తనల్లో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు.. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?