Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

మత్తు వదలరా 2 సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సింహ, ఫరియా అబ్దుల్లా జంటగా నటించగా.. సత్య, వెన్నెల కిషోర్, అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రియా ఎవరు అనే సీన్ చాలా హైలెట్ అయ్యింది.

Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..
Isha Yadav
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2024 | 7:28 AM

రియా ఎవరు ? రియా ఎవరు..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. అసలు ఎవరీ రియా.. ? అంటూ ఆ బ్యూటీ కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన మత్తు వదలరా 2 సినిమాతో ఈ అమ్మాయి చాలా పాపులర్ అయ్యింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. అయితే అందులో ఓ సీన్ బాగా హైలెట్ అయ్యింది. రియా అనే అమ్మాయిని వెతికే క్రమంలో అజయ్, సత్య మధ్య రియా ఎవరు ? .. దామిని డాటర్.. దామిని ఎవరు.. రియా మదర్.. వాళ్లిద్దరూ ఎవరు ? .. డాటర్ అండ్ మదర్ అనే సీన్ ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇప్పుడు అదే సీన్ బాగా వైరలయ్యింది. ఈ సీన్ తర్వాత నెట్టింట ఎక్కడ చూసిన రియా ఎవరు ? అనే టాపిక్ మాత్రం ట్రెండ్ అయ్యింది.

ఇక ఇప్పుడు రియా ఎవరనేది తెలిసిపోయింది. మత్తు వదలరా 2 సినిమాలో రియా పాత్రలో ఓ అమ్మాయి కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ తో కలిసి ఆ అమ్మాయి వచ్చే సీన్ మరింత హైలెట్ అయ్యింది. రియా రియా అనే పేరుతో ఇప్పుడు నెట్టింట తెగ పాపులర్ అయిన అమ్మాయి ఎవరనేది తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. రియా పాత్రలో నటించిన అమ్మాయి ఇషా యాదవ్. నార్త్ ఇండియాకు చెందిన ఈ అమ్మాయి.. తెలుగులో ఇదివరకే ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది.

యూట్యూబర్ దొర సాయితేజ జోడిగా సిద్ధు B.com అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. ఈ మూవీ ద్వారా ఇదివరకే నెట్టింట చాలా పాపులర్ అయ్యింది వైష్ణవి. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ అందుకుని ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత పలు రీల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది రియా. దీంతో అదే పాపులారిటీతో మత్తు వదలరా 2 చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆషార్ట్ ఫిల్మ్ చేసిన అమ్మాయే రియా అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by The Tejindia (@thetejindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.