Prabhas: అందుకే ప్రభాస్‌ నిజమైన ‘డార్లింగ్‌’.. వైరల్‌ అవుతోన్న ఓల్డ్‌ ఎమోషన్‌ వీడియో

ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అక్టోబర్ 23వ తేదీన పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రభాస్ కు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మంచి తనం ఎలాంటిదో చెప్పే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది...

Prabhas: అందుకే ప్రభాస్‌ నిజమైన 'డార్లింగ్‌'.. వైరల్‌ అవుతోన్న ఓల్డ్‌ ఎమోషన్‌ వీడియో
Prabhas
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 23, 2024 | 7:34 AM

ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు ఓ సంచలనం. ప్రభాస్‌ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్‌ స్టార్‌. ఈ హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు రూ. వెయ్యి కోట్లు కలెక్షన్ రావాల్సిందే. అంతలా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు ప్రభాస్‌. టాలీవుడ్‌లో మొదలైన ప్రభాస్‌ ప్రస్తానం ప్రస్తుతం బాలీవుడ్‌ను దాటేసి జపాన్‌ లాంటి దేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకునే స్థాయికి ఎదిగిపోయింది. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ప్రభాస్‌ సొంతం.

ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్నా, ఎన్ని హిట్స్‌ వచ్చినా తనలోని ఆ కల్మషం లేని గుణమే అతన్ని నిజమైన డార్లింగ్‌ను చేసింది. ప్రభాస్‌ మంచితనం గురించి ఎందరో సినీ తారలు ఇప్పటికే చాలా సార్లు పంచుకున్నారు. కాగా నేడు (అక్టోబర్‌ 23) పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్‌కు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌ గొప్ప మనసుకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం మళ్లీ వైరల్‌ అవుతోంది.

వివరల్లోకి వెళితే.. గతంలో కన్నయ్య అలియాస్‌ రంజిత్‌ అనే ప్రభాస్‌ అభిమాని తీవ్రమైన అనారోగ్యసమస్యతో బాధపడ్డాడు. చివరి రోజులు గడుపుతున్న కన్నయ్యకు ప్రభాస్‌ను కలవాలనే బలమైన కోరిక ఉడేది. దీంతో దీంతో అతని తల్లి పూరి జగన్నాథ్ భార్య లావణ్యకి ఫోన్ చేసి .. విషయం చెప్పారు. లావణ్య ప్రభాస్‌తో మాట్లాడడంతో కలవడానికి ఒప్పుకున్నారు.

అంతేకాకుండా కన్నయ్యకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటని కనుక్కొని మరీ ప్రభాస్‌ చికెన్‌ మంచూరియా చేయించి తీసుకెళ్లాడు. అదేవిధంగా బాహుబలిలో వాడిన ఓ కత్తిని కూడా అభిమానికి ఇచ్చాడు. ఇదంతా కన్నయ్య తల్లి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా ఈ వీడియో మళ్లీ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రభాస్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ అభిమాన హీరో మనసు ఎంత గొప్పదో అంటూ మురిసిపోతున్నారు.

ప్రభాస్‌ ఇంటి దగ్గర ఫ్యాన్స్‌ హంగామా..

ఇదిలా ఉంటే ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్‌ ఇంటికి చేరుకున్నారు. ప్రభాస్‌ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్‌ అయ్యారు. ఒకానొక సమయంలో ఫ్యాన్స్‌ను అదుపుచేయలేకపోవడంతో స్వల్ప లాఠీ చార్జీకి సైతం దిగాల్సి వచ్చింది. అయితే ప్రభాస్ అభిమానులు తగ్గేది లేదంటున్నారు. రోడ్డుపై బైఠాయించి, తమ హీరోను కలుస్తామంటూ స్లొగన్స్ ఇస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..