AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Birthday : బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. డార్లింగ్ మంచి మనసు గురించి తెలుసా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ప్రభాస్ బహుబలి సినిమాతో విదేశీయుల అభిమాన హీరో అయ్యాడు. ఇప్పుడు అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు.

Prabhas Birthday : బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. డార్లింగ్ మంచి మనసు గురించి తెలుసా..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 23, 2024 | 7:18 AM

Share

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అభిమానులు ఉన్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పేరు మారుమోగింది. కేవలం సినిమానే డార్లింగ్ ప్రపంచం. ఎవరి విమర్శలను పట్టించుకోడు.. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటాడు. నవ్వుతూనే రెండు మాటలు మాట్లాతాడు తప్ప.. అనవసరమైన విషయాలను ప్రస్తావించడు. తన గురించి ఏవరేమి మాట్లాడిన నవ్వుతూనే వదిలేస్తాడు.. ప్రతి ఒక్కరికి కడుపునిండా భోజనం అందించాలని చూస్తుంటాడు. వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమాతో మాస్ స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అప్పటివరకు లవర్ బాయ్‏గా కనిపించిన డార్లింగ్.. ఛత్రపతి తర్వాత మాస్ యాక్షన్ హీరోగా మారాడు.

డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. జక్కన్న రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, లుక్స్, రాజసం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దీంతో దేశమే కాదు.. పలు దేశాల్లోని సినీ ప్రియులు సైతం ప్రభాస్ కు వీరాభిమానులయ్యారు. ప్రభాస్ సినిమా వచ్చిందంటే విదేశాల్లోనూ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా.. ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రభాస్ సినిమాలు మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ రూ.1000 కోట్ల హిట్స్ కొట్టిన హీరో ప్రభాస్. పెళ్లి మాట ఎత్తకుండా ఇప్పుడు చేతిలో అరడజనుకుపైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు ప్రభాస్. ఈరోజు ఈ పాన్ ఇండియా స్టార్ పుట్టినరోజు. గత నాలుగు రోజుల ముందుగానే విదేశాల్లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు లేడీ ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో డార్లింగ్ పేరు ట్రెండ్ అవుతుంది. తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభాస్ రేర్ ఫోటోస్, లేటేస్ట్ లుక్స్ షేర్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం
Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం
పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..
నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..