- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Adi Saikumar's Prema Kavali Movie Heroine Esha Chawla, See Her Latest Photos
Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..
సినీరంగంలో ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని, ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఇషా చావ్లా ఒకరు. ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.
Updated on: Oct 22, 2024 | 12:15 PM

విలక్షణ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా ప్రేమకావాలి. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇషా చావ్లా హీరోయిన్.

ఈ మూవీతోనే కథానాయికగా తన కెరీర్ స్టార్ట్ చేసింది ఇషా. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ వయ్యారి. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఇషా చావ్లాకు కూడా మంచి క్రేజ్ వచ్చేసింది.

ప్రేమ కావాలి సినిమా హిట్ కావడంతో ఇషా చావ్లాకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అదృష్టం కలిసిరాలేదు. తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.. కానీ స్టార్ డమ్ రాలేదు.

ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాల్లో నటించిన ఇషా చావ్లా చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర మూవీలో నటిస్తున్నట్లు టాక్.

పదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి తెలుగు సినిమాల్లో నటిస్తుంది ఇషా చావ్లా. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. చదువు పూర్తైన వెంటనే యాక్టింగ్ కోర్స్ తీసుకున్న ఈ ఢిల్లీ బ్యూటీ.. ఇప్పుడు సరైన క్రేజ్ కోసం చూస్తుంది.





























