Raja Saab: రాజా సాబ్‌లో ఆ విషయంపై ప్రభాస్ ఫోకస్
డార్లింగ్ ప్రభాస్ ఇప్పటి వరకు ఫాంటసీ డ్రామాలు లేదంటే భారీ యాక్షన్ థ్రిల్లర్స్.. అదీ కాదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్స్ ఇలా అన్ని చేసి చేసి బోర్ కొట్టినట్లు ఉంది.. అందుకే తను ఈ మధ్య మిస్ అయిందంతా మారుతి రాజా సాబ్ సినిమాలో చూపించేస్తున్నారు రెబల్ స్టార్. తాజాగా ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్ ఇచ్చారు మారుతి. మరి అదేంటో మీరే లుక్ వేయండి..
Updated on: Oct 22, 2024 | 5:38 PM

అయితే ఫాంటసీ డ్రామాలు.. లేదంటే భారీ యాక్షన్ థ్రిల్లర్స్.. అదీ కాదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్స్.. ఇవన్నీ చేసి చేసి ప్రభాస్ తెగ బోర్ ఫీల్ అవుతున్నారేమో..? అందుకే తను ఈ మధ్య మిస్ అయిందంతా మారుతి రాజా సాబ్ సినిమాలో చూపించేస్తున్నారు రెబల్ స్టార్. తాజాగా ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్ ఇచ్చారు మారుతి. మరి అదేంటో మీరే చూసేయండి..!

బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్‌ను మర్చిపోయేలా చేసారు దర్శకులు. మధ్యలో రాధే శ్యామ్‌లో లవర్ బాయ్‌లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. అందుకే కాస్త రిలీఫ్ కోసం మారుతితో పక్కా ఎంటర్‌టైనర్ చేస్తున్నారు ప్రభాస్. దీనికోసం కూడా 200 కోట్లు ఖర్చు చేస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ కూడా ఈ రోజే రివీల్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్.

తాజాగా రాజా సాబ్ నుంచి మరో లుక్ వచ్చింది. ఇందులో డార్లింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు ప్రభాస్. హార్రర్ కామెడీగా రాజా సాబ్ వస్తుంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా టీజర్ విడుదల కానుంది. 2025 ఎప్రిల్ 10న రానున్నాడు రాజా సాబ్. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.




