AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muskaan: జార్జిరెడ్డి బుల్లెట్ బండి సాంగ్ హీరోయిన్ గుర్తుందా? అమ్మయ్యాక మరింత అందంగా మారిపోయిందిగా..

హీరోలతో పోలిస్తే సినిమా హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. పెళ్లయ్యాక చాలా మంది నటీమణులు యాక్టింగ్ కు కామా లేదా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. తమ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించం అలాగే పిల్లల పెంపకంలో బిజీ అయిపోతుండడమో చేస్తుంటారు.

Muskaan: జార్జిరెడ్డి బుల్లెట్ బండి సాంగ్ హీరోయిన్ గుర్తుందా? అమ్మయ్యాక మరింత అందంగా మారిపోయిందిగా..
Actress Muskaan Khubchandani
Basha Shek
|

Updated on: Oct 23, 2024 | 8:27 PM

Share

వివిధ కారణాలతో  సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటారు కొందరు  అందాల భామలు. అలా ఇప్పుడు కూడా ఓ తెలుగు హీరోయిన్ నెట్టింట గత్తర లేపుతోంది. ఆమె జార్జి రెడ్డి సినిమా నటి ముస్కాన్ ఖుబ్‌చాంది. 2019లో విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలో ముస్కాన్ డబుల్ రోల్ లో మెరిసింది. ముఖ్యంగా ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అనే సాంగ్ తో బాగా ఫేమస్ అయిపోయిందీ అందాల తార. ఈ పాటలో ముస్కాన్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ సినీ ఆడియెన్స్ ను ఫిదా చేశాయి. జార్జి రెడ్డి సినిమా కూడా విజయం సాధించడంతో ముస్కాన్ కు కూడా సినిమా అవకాశాలు బాగా వస్తాయనుకున్నారు చాలా మంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. జార్జి రెడ్డి మూవీ తర్వాత ముస్కాన్ తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమానే చేసింది. రాజశేఖర్ నటించిన శేఖర్ లో ఒక కీలక పాత్ర పోషించిందీ ముద్దుగుమ్మ.

ముస్కాన్ కు నటనతో పాటు జిమ్నాస్టిక్స్ లోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే కథక్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది ముస్కాన్. లాక్మే, లేయార్ వోట్టా గర్ల, కాఫీ బైట్ వంటి ఫేమస్ యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. బ్లాక్ బస్టర్ మూవీ వీర్ ది వెడ్డింగ్‌లో ఒక కీలక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత జార్జి రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. దీంతో పాటు లక్ష్మీ, 420 ఐపీసీ, శేఖర్ తదితర సినిమాల్లోనూ మెరిసింది.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీతో జార్జి రెడ్డి హీరోయిన్..

సినిమాల సంగతి పక్కన పెడితే.. జెన్ బుద్దీ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది ముస్కాన్. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చైల్ట్ ఎడ్యుకేటర్‌గా పని చేస్తోంది. పిల్లల సంరక్షణ గురించి వీడియోలు చేస్తూ వాటిని ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

కూతురితో నటి ముస్కాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్