AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్.. వీడియో చూడండి

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది కృతి సనన్. మిమీ సినిమాలో తన నటనా ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. తెలుగులో వన్.. నేనొక్కడినే, దోచేయ్ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ఇక గతేడాది ప్రభాస్ సరసన ఆదిపురుష్ లోనూ సీతమ్మగా మెరిసింది.

Kriti Sanon: ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్.. వీడియో చూడండి
Kriti Sanon
Basha Shek
|

Updated on: Oct 23, 2024 | 9:41 PM

Share

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఉత్తమ నటి అనడంలో సందేహం లేదు. జాతీయ అవార్డు గ్రహీతగా ఆమె నటనా ప్రతిభపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఓ కొత్త పాట కారణంగా కృతి అనవసరంగా ట్రోల్‌కి గురవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ‘దో పట్టి’. ఇందులో ‘అకియా దే కోల్..’ పాటలో కృతి ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసింది. అయితే ఈ పాట డ్యాన్స్ స్టెప్పులు చూసిన ప్రతి ఒక్కరు ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ని గుర్తు చేసుకున్నారు . అవును,ఈ పాటలో డ్యాన్స్ ను కృతి సనన్ కాపీ చేసిందని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబందించి వివరాలిలా ఉన్నాయి. కృతి సనన్ కథానాయికగా నటించిన చిత్రం ‘దో పట్టి’. ఇందులో ఆమెది ద్విపాత్రాభినయం. ఈ సినిమాలో సీనియర్ నటి కాజోల్ కూడా నటించింది. తాజాగా ఈ సినిమాలోని ‘అకియా దే కోల్..’ పాటను రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే ‘ధూమ్ 2’ సినిమాలోని ‘క్రేజీ కియారే..’ పాట డ్యాన్స్‌కి పోలిక కనిపిస్తోంది.

2006లో విడుదలైన ‘ధూమ్ 2’ సినిమాలో ‘క్రేజీ కియారే..’ పాటలో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఎంతో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేశారు. ఇది నేటికీ ఐశ్వర్యరాయ్ అభిమానులకు ఇష్టమైన పాట. అయితే ఆ పాటలోని డ్యాన్స్ స్టెప్పులను కృతి సనన్ ‘అకియా దే కోల్..’ పాటలో కాపీ కొట్టి నెటిజన్లకు దొరికిపోయింది. విజయ్ గంగూలీ ‘అకియా దే కోల్..’ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ‘దో పట్టి’ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ ఈ సినిమా అక్టోబర్ 25న నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో. కృతి సనన్ కథానాయికగా నటించడమే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. ప్రముఖ బుల్లితెర నటుడు షహీర్ షేక్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Radio Nasha (@radionasha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..